ETV Bharat / sports

రెండో రౌండ్​కు జకోవిచ్​.. టోర్నీ నుంచి తప్పుకున్న క్విటోవా - జకోవిచ్​ ఫ్రెంచ్​ ఓపెన్​

ఫ్రెంచ్​ ఓపెన్​లో ప్రపంచ టెన్నిస్​ నంబరు.1 నొవాక్​ జకోవిచ్​ రెండో రౌండ్​కు చేరుకున్నాడు. తొలి రౌండ్​లో అమెరికాకు చెందిన శాండ్​గ్రెన్​పై విజయం సాధించాడు. మరోవైపు గాయం కారణంగా చెక్​ టెన్నిస్​ క్రీడాకారిణి టోర్నీ నుంచి వైదొలగింది.

French Open: Djokovic reaches 2nd round, Petra Kvitova withdraws
రెండో రౌండ్​కు జకోవిచ్​.. టోర్నీ నుంచి తప్పుకున్న క్విటోవా
author img

By

Published : Jun 2, 2021, 11:30 AM IST

Updated : Jun 2, 2021, 12:32 PM IST

పారిస్​ వేదికగా జరుగుతోన్న ఫ్రెంచ్​ ఓపెన్​లో ప్రపంచ టెన్నిస్​ నంబరు.1 నొవాక్​ జకోవిచ్​ రెండో రౌండ్​కు చేరుకున్నాడు. తొలి రౌండ్​లో అమెరికాకు చెందిన శాండ్​గ్రెన్​పై 6-2, 6-4, 6-2 తేడాతో విజయం సాధించాడు.

కెరీర్​లో ఇప్పటివరకు 18 గ్రాండ్​స్లామ్​ టైటిల్స్​ సాధించిన జకోవిచ్​.. ప్రస్తుతం 19వ టైటిల్​ సొంతం చేసుకునేందుకు కోసం పోరాటం చేస్తున్నాడు. అయితే అతి త్వరలోనే 20 గ్రాండ్​స్లామ్​ టైటిల్​ మార్క్​ను చేరుకుంటానని జకోవిచ్​ ధీమా వ్యక్తం చేశాడు.

టోర్నీకి దూరమైన క్విటోవా

నవోమి ఒసాకా తర్వాత మరో టెన్నిస్​ క్రీడాకారిణి ఫ్రెంచ్​ ఓపెన్​ నుంచి తప్పుకుంది. గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు చెక్​ క్రీడాకారిణి పెట్రా క్విటోవా ప్రకటించింది.

ఇదీ చూడండి: French Open: రెండో రౌండ్​కు నాదల్​, బార్టీ

Last Updated : Jun 2, 2021, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.