అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు సాధించిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్(20)ను సమం చేశాడు సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్. ఆదివారం అత్యంత ఉత్కంఠగా సాగిన వింబుల్డన్( Wimbledon) పురుషుల సింగిల్స్ ఫైనల్లో విజయం సాధించి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
ఇటలీ ఆటగాడు బెరిటిని(Matteo Berrettini)పై తొలి సెట్లో ఓడినా తర్వాత వరుస సెట్లలో 6-7(4-7),6-4,6-4,6-3 తేడాతో విజయాన్ని అందుకున్నాడు.
జకోకు.. కెరీర్లో ఆరో వింబుల్డన్ టైటిల్. 9 ఆస్ట్రేలియన్ ఓపెన్, 3 యూఎస్ ఓపెన్, 2 ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లతో కలిపి మొత్తం 20 టైటిళ్లు అందుకున్నాడు. స్విట్జర్లాండ్ స్టార్ ఫెదరర్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ కూడా 20 టైటిళ్లు గెలిచారు.
క్యాలెండర్ ఇయర్ గ్రాండ్ స్లామ్..
ఈ క్యాలెండర్ ఇయర్లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలిచిన జకోవిచ్.. యూఎస్ ఓపెన్పైనా కన్నేశాడు. ఆ మేజర్ టోర్నీ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. అదీ గెలిస్తే.. 52 ఏళ్లుగా రాడ్ లేవర్ పేరిట ఉన్న రికార్డు బద్దలవుతుంది.
ఇదీ చదవండి: Wimbledon: క్రొయేషియా జోడీకే వింబుల్డన్ డబుల్స్ ట్రోఫీ