ETV Bharat / sports

Wimbledon: వింబుల్డన్​ నుంచి వైదొలిగిన హలెప్ - పిక్క గాయంతో హలెప్ వింబుల్డన్​కు దూరం

రోమ్​ టెన్నిస్ క్రీడాకారిణి సిమోనా హలెప్​ వింబుల్డన్​ టోర్నీకి దూరమైంది. కాలి గాయంతో బాధపడుతున్న ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్​లోనూ హలెప్​ పాల్గొనలేదు.

wimbeldon, simona halep
వింబుల్డన్​ ఓపెన్, సిమోనా హలెప్
author img

By

Published : Jun 25, 2021, 4:21 PM IST

మహిళల సింగిల్స్​ డిఫెండింగ్ ఛాంపియన్​ సిమోనా హలెప్​ వింబుల్డన్ ఓపెన్ 2021​ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. కాలి గాయంతో బాధపడుతున్న హలెప్​ ఈ నిర్ణయం తీసుకుంది.

రోమ్​ వేదికగా మేలో జరిగిన డబ్ల్యూటీఏ ఈవెంట్​లో గాయం కారణంగా ఆట మధ్యలోనే తప్పుకొంది హలెప్​. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్​ ఓపెన్​లోనూ పాల్గొనలేదు.

"కాలిపిక్క గాయం కారణంగా వింబుల్డన్​లో పాల్గొనట్లేదు. దురదృష్టవశాత్తూ నా శరీరం సహకరించట్లేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కలత చెందా. ఇటీవల ఫ్రెంచ్​ ఓపెన్​తో పాటు ప్రస్తుత టోర్నీకి కూడా దూరం అవ్వడం బాధాకరం. దీని నుంచి తేరుకోవడానికి నేను మానసికంగా, భౌతికంగా దృఢంగా తయారవ్వాల్సిన అవసరం ఉంది."

-హలెప్, టెన్నిస్ క్రీడాకారిణి.

ప్రపంచ ఐదో సీడ్ ఆటగాడు డొమినిక్ థీమ్ కూడా వింబుల్డన్​కు దూరమయ్యాడు. కుడిచేతి గాయంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. మల్లోర్కా ఛాంపియన్​షిప్స్​లో ఆడుతున్న థీమ్​ కుడిచేతి మణికట్టుకు గాయమైంది.

ఇదీ చదవండి: Wimbledon: వింబుల్డన్​కు ఎంపికైన తొలి చైనా ఆటగాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.