టెన్నిస్ టోర్నీ రోజర్స్కప్లో సంచలనం నమోదైంది. 18 ఏళ్ల బియాంకా ఆండ్రెస్కు టోర్నీలో ఫైనల్ చేరింది. 1969 తర్వతా ఈ ఘనత సాధించిన కెనడా అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. ఈ యువ క్రీడాకారిణి శనివారం జరిగిన సెమీఫైనల్లో సోఫియా కెనిన్ (అమెరికా)ను ఓడించింది. ఆదివారం టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌తో టైటిల్ కోసం పోటీపడనుంది.
శనివారం కెనిన్‌తో జరిగిన సెమీస్‌లో 6-4, 7-6 (5) తేడాతో విజయం సాధించింది బియాంకా. మార్చిలో ఇండియన్ వెల్స్ టైటిల్ గెలిచి... వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా ఈ టోర్నమెంటులో అడుగుపెట్టింది. రోజర్స్ కప్ ఆరంభ మ్యాచ్‌లో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత ఏంజెలికా కెర్బన్ (జర్మనీ)ను ఓడించింది ఆండ్రెస్కు. ఆమె కెరీర్‌లో ఇదే తొలి డబ్ల్యూటీఏ టైటిల్.
ఈ మ్యాచ్‌కు ముందు భుజం గాయం కారణంగా కొన్ని నెలలు ఆటకు దూరమైంది. మళ్లీ కోర్టులో అడుగుపెట్టి ప్రతిష్ఠాత్మక టోర్నమెంటులో తుది పోరుకు అర్హత సాధించింది.
" రెండు నెలల విరామం తర్వాత బ్యాట్ పట్టడం ఆనందంగా ఉంది. ఈ గెలుపు చాలా ఆనందాన్నిచ్చింది. మంచి ప్రదర్శన చేసేందుకు చాలా రోజులు కష్టపడ్డాను. ఆట ప్రారంభంలో కొంచెం భయపడ్డాను. ఇండియన్ వెల్స్ కన్నా ఈ విజయం ఎక్కువ ఆనందాన్నిచ్చింది".
-- బియాంకా ఆండ్రెస్కు, టెన్నిస్ క్రీడాకారిణి
మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన సెరెనా విలియమ్స్‌తో ఆదివారం జరిగే ఫైనల్లో తలపడనుంది బియాంకా.
- — Bianca (@Bandreescu_) August 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
— Bianca (@Bandreescu_) August 11, 2019
">— Bianca (@Bandreescu_) August 11, 2019
ఇదీ చూడండి: పాక్‌ను కొట్టేసి.. చరిత్ర సృష్టించిన భారత్