ETV Bharat / sports

ప్రేక్షకులు లేకుండానే ఆస్ట్రేలియన్​ ఓపెన్​ - విక్టోరియాలో లాక్​డౌన్​- కొనసాగనున్న ఆస్ట్రేలియన్​ ఓపెన్​

ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో లాక్​డౌన్ ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కొత్త రకం వైరస్​ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియన్​ ఓపెన్​ టోర్నీ షెడ్యూల్​ ప్రకారమే జరుగుతుందని పేర్కొంది.

Australian Open to continue despite five-day lockdown
విక్టోరియాలో లాక్​డౌన్​- కొనసాగనున్న ఆస్ట్రేలియన్​ ఓపెన్​
author img

By

Published : Feb 12, 2021, 10:58 AM IST

ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఐదు రోజుల పాటు లాక్​డౌన్​ ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కొత్త స్ట్రెయిన్​ రకం వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవడానికే ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది. మెల్​బోర్న్​లో ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్​ ఓపెన్​ మాత్రం షెడ్యూల్​ ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది.

"విక్టోరియా రాష్ట్రంలో ఫిబ్రవరి 13 నుంచి ఐదు రోజుల పాటు లాక్​డౌన్ విధించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్​ ఓపెన్​ పోటీలు యథావిధంగా జరుగుతాయి. ప్రేక్షకులకు మాత్రం అనుమతి లేదు. టికెట్​ తీసుకున్న వీక్షకులు, ఆటగాళ్లు, సిబ్బంది ఈ విషయాన్ని గమనించాలి" అని టోర్నీ నిర్వహకులు వెల్లడించారు.

లాక్​డౌన్​ విషయాన్ని విక్టోరియన్​ ప్రీమియర్ డేనియల్​ ఆండ్రూస్​ ధ్రువీకరించారు. 'ఆటలు మాత్రం యథా ప్రకారం జరుగుతాయి. కానీ అభిమానులకు అనుమతి లేదు. టికెట్లు కొనుగోలు చేసిన వారికి వీలైనంత తొందరగా డబ్బులు తిరిగి చెల్లిస్తాం' అని ఆండ్రూస్​ తెలిపారు.

ఇదీ చదవండి: ఐపీఎల్-14లో శ్రీశాంత్​కు నిరాశ - వేలంలో దక్కని చోటు​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.