ETV Bharat / sports

'ఆస్ట్రేలియన్ ఓపెన్' ప్రైజ్​మనీ భారీగా పెరిగిందోచ్ - ఆస్ట్రేలియా ఓపెన్ ప్రైజ్​మనీ

వచ్చే నెల 20 నుంచి జరగనున్న 'ఆస్ట్రేలియన్ ఓపెన్'​ ప్రైజ్​మనీ భారీగా పెరిగింది. గతేడాదితో పోల్చితే 13.6 శాతం ఎక్కువైంది. ఈ విషయాన్ని టోర్నీ డైరక్టర్ క్రేగ్​ వెల్లడించారు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్​మనీ భారీగా పెరిగిందోచ్
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్​మనీ
author img

By

Published : Dec 25, 2019, 4:33 PM IST

Updated : Dec 25, 2019, 6:49 PM IST

వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే 'ఆస్ట్రేలియన్ ఓపెన్‌' నగదు బహుమతిని భారీగా పెంచారు నిర్వాహకులు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి ఏకంగా 13.6 శాతం పెరిగింది. ప్రస్తుతం 'ఆస్ట్రేలియా ఓపెన్‌' ప్రైజ్‌మనీ రూ.350 కోట్లకు చేరింది.

పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలకు నగదు బహుమతి రూ.20 కోట్లు దక్కనుంది. తొలి రౌండ్‌లోనే నిష్క్రమించేవారికి రూ.44 లక్షలు, రెండో రౌండ్‌లో ఇంటిముఖం పట్టేవారికి రూ.63 లక్షలు ఇవ్వనున్నట్లు టోర్నీ డైరెక్టర్‌ క్రేగ్‌ టిలే తెలిపారు.

Australian Open 2020
ఆస్ట్రేలియాన్ ఓపెన్​ 2020

"ప్రతి ఏడాదిలా ఈ సారి నగదు బహుమతిని పెంచాం. 2007తో పోల్చుకుంటే నగదు బహుమతి 2020 సీజన్‌ నాటికి మూడు రెట్లు పెరిగింది. ఈ సీజన్‌లో రౌండ్‌ దాటే కొద్ది ప్రైజ్‌మనీ పెరుగుతూ ఉంటుంది. చాలా మంది ఆటగాళ్లు మరింత ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది" -క్రేగ్‌ టిలే, టోర్నీ డైరెక్టర్‌

ఆస్ట్రేలియన్ ఓపెన్‌' ప్రైజ్‌మనీ గత పదేళ్లలో ఏకంగా 183.9 శాతం పెరిగింది. వచ్చే నెల జనవరి 20 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ టోర్నీ జరగనుంది. గత సీజన్‌ పురుషుల సింగిల్స్‌లో నోవాక్‌ జకోవిచ్‌, మహిళల సింగిల్స్‌లో నవోమి ఒసాకా టైటిల్‌ కొట్టారు.

SNTV Daily Planning, 0800 GMT
Wednesday 25th December 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Jurgen Klopp labels the Premier League's festive fixture congestion "a crime" despite it severely damaging his side's main title rival Manchester City. Expect at 2230.
Last Updated : Dec 25, 2019, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.