ETV Bharat / sports

Wimbledon: వింబుల్డన్​లో ఆ మహిళా అంపైర్​​ రికార్డు - female chair umpire

వింబుల్డన్(Wimbledon)​ చరిత్రలో తొలిసారిగా పురుషుల సింగిల్స్​ ఫైనల్స్​లో ఓ మహిళా.. ఛైర్​​ అంపైర్​గా వ్యవహరించనుంది. ఆదివారం జకోవిచ్​, బెరిటిని మధ్య జరగనున్న తుదిపోరుకు రిఫరీగా ఈమె ఎంపికైంది.

djokovic
జకోవిచ్​
author img

By

Published : Jul 10, 2021, 7:40 PM IST

Updated : Jul 10, 2021, 8:23 PM IST

వింబుల్డన్ (Wimbledon)​​ చరిత్రలో తొలిసారి ఓ మహిళా(మరిజా సిసాక్) .. పురుషుల సింగిల్స్​లో ఛైర్​​ అంపైర్​గా ఉండనుంది. ఆదివారం జరగనున్న ఫైనల్​లో ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ తుదిపోరు జకోవిచ్​, బెరిటిని మధ్య జరగనుంది.

మరిజా సిసాక్​(క్రోషియా).. 2012 నుంచి డబ్ల్యూటీఏ ఎలైట్​ టీమ్​లో సభ్యురాలిగా ఉంటున్నారు. ఆమె గోల్డ్​ బ్యాడ్జ్​ ఛైర్​​ అంపైర్​. 2014 వింబుల్డన్​ మహిళల సింగిల్స్​లో, అనంతరం గత మూడేళ్లుగా మహిళల డబుల్స్​ ఫైనల్​లో ఛైర్​ అంపైర్​గా వ్యవహరిస్తున్నారు. 2016 రియో డి జనిరో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ గోల్డ్​ మ్యాచ్‌ను కూడా ఛైర్​​ అంపైర్​గా ఉన్నారు.

ఇదీ చూడండి: Wimbledon 2021: ఆ రికార్డుకు అడుగు దూరంలో జకో

Last Updated : Jul 10, 2021, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.