టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) తర్వాత ఈ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటానని ఇటీవలే వెల్లడించాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. కాగా, ఈ టోర్నీలో కనీసం సెమీఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది భారత జట్టు. దీంతో కోహ్లీ వన్డే కెప్టెన్సీ(virat kohli captaincy news) నుంచి కూడా తప్పుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తంగా పరిమిత ఓవర్ల జట్లకు కొత్త కెప్టెన్ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయమై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(sehwag on virat kohli)ను ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పాడీ విధ్వంసకర ఓపెనర్.
"మిగతా రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకోవడమనేది పూర్తిగా కోహ్లీ(virat kohli captaincy news) వ్యక్తిగత విషయం. ఒకవేళ అతడు ఆటగాడిగానే కొనసాగాలనుకుంటే అది అతడి ఇష్టం. నాకు తెలిసి కోహ్లీ కెప్టెన్సీలో టీమ్ఇండియా గొప్పగా ఆడుతోంది. సారథిగా అతడి రికార్డులు బాగున్నాయి. వన్డే, టెస్టులకు కెప్టెన్గా కొనసాగాలా? వద్దా? అనేది అతడి వ్యక్తిగతం. నా అభిప్రాయం ప్రకారం కోహ్లీ కెప్టెన్గా కొనసాగితే బాగుంటుంది. ఎందుకంటే మంచి ప్లేయర్ జట్టుకు కెప్టెన్గా ఉంటే ఆ ప్రభావం వేరే ఉంటుంది. ఇలాంటి కఠిన సమయాల్లో అభిమానులు జట్టుకు మద్దతుగా నిలవాలి. భారత్ ఐసీసీ టోర్నీ గెలిచి చాలాకాలం అవుతోంది. ద్వైపాక్షిక సిరీస్ గెలిచినా గెలవకపోయినా.. ఐసీసీ టోర్నీ గెలిస్తే అందరూ గుర్తుంచుకుంటారు."
-సెహ్వాగ్, మాజీ క్రికెటర్
ఐసీసీ టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో భాగంగా నేడు (నవంబర్ 8) తన చివరి మ్యాచ్ ఆడనుంది భారత్. నమీబియా(ind vs nmb t20)తో జరిగే ఈ పోరులో జట్టులో పలు మార్పులు చేసే వీలుంది. కోచ్గా రవిశాస్త్రికి, టీ20 ఫార్మాట్లో కెప్టెన్గా కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం.
ఇవీ చూడండి: 'ఐపీఎల్ వల్లే టీమ్ఇండియా ఇలా.. దేశం తర్వాతే ఏదైనా'