ETV Bharat / sports

ఆదివారం ఏం జరుగుతుందో చూద్దాం: కోహ్లీ

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)​లో భాగంగా శుక్రవారం స్కాట్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా(ind vs sco t20). దీంతో నెట్​ రన్​రేట్ మెరుగుపర్చుకుంది. ఇక తర్వాత మ్యాచ్​లో న్యూజిలాండ్​ను అఫ్గానిస్థాన్ ఓడిస్తే కోహ్లీసేన సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై స్పందించాడు టీమ్ఇండియా సారథి కోహ్లీ.

Virat Kohli h
కోహ్లీ
author img

By

Published : Nov 6, 2021, 8:48 AM IST

టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021)లో టీమ్‌ఇండియా సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. శుక్రవారం రాత్రి స్కాట్లాండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన భారత్‌(ind vs sco t20) 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని 85 పరుగులకే కట్టడి చేసిన కోహ్లీసేన.. ఛేదనలో రెండు వికెట్లు కోల్పోయి 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో గ్రూప్‌-2లో అత్యధిక రన్‌రేట్‌ కలిగిన జట్టుగా నిలిచింది. ఇక ఆదివారం అఫ్గానిస్థాన్‌ జట్టు న్యూజిలాండ్‌(nz vs afg t20)ను ఓడించడమే మిగిలింది. అదే జరిగితే భారత్‌ సెమీస్‌ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విజయంపై మాట్లాడిన కోహ్లీ ఇలాంటి ప్రదర్శన కోసమే తాము ఎదురుచూస్తున్నామని చెప్పాడు.

"ఇది సంపూర్ణ ఆధిపత్యం. ఇలాంటి ప్రదర్శనే మరోసారి చేయాలని చూస్తున్నాం. ఇక ఇప్పుడు ఆదివారం (నవంబర్‌ 7) ఏం జరగబోతుందనేది ఆసక్తిగా మారింది. ఆ మ్యాచ్‌ ఎలా సాగుతుందో చూడాలి. ఈరోజు ఆట గురించి పెద్దగా చెప్పాలని లేదు. మేం ఏం చేయగలమో మాకు తెలుసు. అలాగే ఈ వేదికపై టాస్‌ ఎంత కీలకమో కూడా చూడాలనుకుంటున్నాం. స్కాట్లాండ్‌ను 110 లేదా 120లోపు కట్టడి చేయాలనుకున్నాం. బౌలర్లు మెరిశారు. రాహుల్‌ బాగా ఆడాడు. ఇక ఛేదనలో మేం 8-10 ఓవర్ల మధ్య లక్ష్యాన్ని పూర్తి చేయాలని చూశాం. రోహిత్‌, రాహుల్‌ నిలకడగా ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయని అనుకున్నాం. రెచ్చిపోయి ఆడాలని అనుకోలేదు. ఎందుకంటే అలాంటి సమయంలో రెండు మూడు వికెట్లు పడ్డా ఆట మరో మూడు ఓవర్లు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. మేం ప్రాక్టీస్‌ సెషన్‌లోనూ ఇలాగే ఆడాం. మా సహజమైన ఆట కూడా ఇలాగే ఉంటుంది. కానీ, ఆ రెండు మ్యాచ్‌ల్లోనే (పాక్‌, కివీస్‌ మ్యాచ్‌లు) కుదరలేదు. ఆ రెండు జట్లు బౌలింగ్‌ అద్భుతంగా చేసి మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టాయి. ఈరోజు జడేజా, షమీ బాగా బౌలింగ్‌ చేశారు."

-కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్

అనుష్క, వామికా ఉంటే చాలు..

అనంతరం తన పుట్టిన రోజు వేడుకలపై మాట్లాడిన కోహ్లీ(virat kohli birthday).. తాను సెలబ్రేట్‌ చేసుకునే దశ దాటిపోయానని చెప్పాడు. తన కుటుంబం పక్కనే ఉంటే చాలని, ఇప్పుడు బయోబబుల్‌ లాంటి పరిస్థితుల్లో అనుష్క, వామికా తనతో ఉన్నారని సంతోషం వ్యక్తం చేశాడు. అదే తనకు సెలబ్రేషన్స్‌ లాంటిదని తెలిపాడు. టీమ్‌ఇండియా బాగా ఆడిందని, ప్రతి ఒక్కరూ తనకు శుభాకాంక్షలు చెప్పారని కోహ్లీ అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.