టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు డస్సెన్ (94), మార్క్రమ్ (52) చెలరేగిపోయారు. సెమీస్ చేరాలంటే మెరుగైన రన్‌రేట్ సాధించాల్సిన నేపథ్యంలో ధాటిగా ఆడుతూ అర్ధ శతకాలు బాదారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. ఇంగ్లాండ్ ముందు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. డికాక్ (34) ఫర్వాలేదనిపించాడు.
ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.