టీ20 ప్రపంచకప్‌లో(t20 world cup 2021) న్యూజిలాండ్‌పై అఫ్గానిస్థాన్ గెలవాలి..! భారత్‌లో ఇప్పుడు కోట్లాది అభిమానుల ప్రార్థన ఇది. అఫ్గానిస్థాన్.. న్యూజిలాండ్(Nz vs AFG t20)ను ఓడిస్తే సెమీస్ చేరేందుకు భారత్‌కు మార్గం సుగమం అవుతుంది. అయితే అఫ్గాన్ విజయం భారత్‌కు మాత్రమే కాదు.. ఆ జట్టుకూ ఎంతో అవసరం. ఎందుకంటే ఆ జట్టు కూడా ఇప్పుడు రేసులో ఉంది. గ్రూప్- 2 నుంచి పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. మరో స్థానం కోసం భారత్‌తో పాటు న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ పోటీపడుతున్నాయి. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచిన కివీస్.. ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నాలుగు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాల చొప్పున సాధించిన భారత్, అఫ్గానిస్థాన్ చెరో 4 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
- ప్రస్తుత పరిస్థితుల్లో ముందంజ వేసే అవకాశం కివీస్‌కే మెండుగా ఉంది. ఆ జట్టు తన చివరి గ్రూపు మ్యాచ్‌లో ఆదివారం అఫ్గానిస్థాన్(Nz vs AFG t20)తో తలపడుతుంది. విజయం సాధిస్తే మిగతా సమీకరణాలతో సంబంధం లేకుండా న్యూజిలాండ్ సెమీస్‌కు వెళ్తుంది.
- ఒకవేళ ఆఖరి మ్యాచ్‌లో అఫ్గాన్ గెలిస్తే న్యూజిలాండ్(Nz vs AFG t20) రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కివీస్ కంటే అఫ్గాన్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. అయితే ఆ జట్టు సెమీస్ అవకాశాలు భారత్‌పై ఆధారపడి ఉంటాయి.
- సూపర్-12లో ఆఖరి మ్యాచ్‌లో భారత్.. నమీబియా(ind vs nam t20)ను ఎదుర్కోనుంది. కివీస్‌ను అఫ్గాన్ ఓడించినా.. ఆ జట్టు రన్‌రేట్ పెద్దగా పెరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పటికే అఫ్గాన్ కంటే మెరుగైన రన్‌రేట్ కలిగిన భారత్ విజయం సాధిస్తే ముందంజ వేయొచ్చు.