టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) భాగంగా అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో అనూహ్య ఘటన జరిగింది. స్టేడియం చీఫ్ క్యురేటర్ మోహన్ సింగ్ (Mohan Singh Death News) ఆదివారం కన్నుమూశారు. మొహాలీకి చెందిన మోహన్ సింగ్.. నవంబర్ 7న అఫ్గాన్, కివీస్ మధ్య మ్యాచ్‌కు (NZ vs Afg T20) క్యురేటర్‌గా ఉన్నారు. మ్యాచ్‌కు ముందు ఆయన తన గదిలో విగతజీవిగా పడి ఉన్నట్లు సమాచారం.
మోహన్.. 2004లో అబుదాబికి వచ్చారు. అంతకుముందు పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న పంజాబ్ క్రికెట్ స్టేడియంలో క్యురేటర్‌గా శిక్షణ పొందారు. అక్కడ ఆయన 1994లో చేరారు. తొలుత గ్రౌండ్ సూపర్వైజర్గా, తర్వాత కోచ్‌గా, సహాయకుడిగా సేవలందించారు.
ఆదివారం కివీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. నజీబుల్లా మినహా మిగిలిన బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. కీవిస్ బౌలర్లలో బౌల్ట్ 3 వికెట్లు, సౌథీ 2, మిల్నే, సోధీ, నీషమ్ తలో వికెట్ పడగొట్టారు.
ఇదీ చూడండి: 'న్యూజిలాండ్‌పై అఫ్గాన్ గెలిస్తే.. ఆ అనుమానాలు ఖాయం'