బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్(shakib al hasan news) టీ20 ప్రపంచకప్ టోర్నీకి దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందే హసన్‌కు గాయం కావడం బంగ్లా జట్టుకు పెద్ద దెబ్బే. అయితే.. తొడ కండరాల్లో స్వల్ప చీలిక ఏర్పడిన కారణంగా షకిబ్ టోర్నీకి(T20 World Cup) దూరమైనట్లు తెలుస్తోంది.
"షకిబ్‌కు తొడకండరాల్లో గాయమైంది. ఏ గ్రేడ్ గాయమనేది స్కానింగ్ రిపోర్ట్స్ అనంతరం స్పష్టమవుతుంది. ప్రస్తుతం టోర్నీ నుంచి అతడు తప్పుకుంటున్నాడు." అని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
సూపర్ 12 పోటీల్లో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌లు ఆడింది. ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. అయితే.. గాయం కారణంగా షకిబ్ దూరమవడం బంగ్లా జట్టుకు తీరని లోటే. ఇటీవలే ఆ జట్టుకు చెందిన మహమ్మద్ సైఫుద్దీన్ నడుం నొప్పి కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో రుబెల్ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం షకిబ్ స్థానంలో ఎవరు ఆడుతారనేది తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:
IND vs NZ T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమ్ఇండియా బ్యాటింగ్