అఫ్గానిస్థాన్ లెగ్‌స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan News) మరో ఘనత సాధించాడు. టీ20ల్లో 400 వికెట్ల క్లబ్లో (400 Wickets in T20) చేరాడు. టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) భాగంగా ఆదివారం న్యూజిలాండ్ మ్యాచ్‌లో తీసిన వికెట్‌తో ఈ మైలురాయిని చేరుకున్నాడు.
23 ఏళ్ల రషీద్ ఖాన్ (Rashid Khan Wickets).. 289 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించాడు. అతడి కన్నా ముందు డ్వేన్ బ్రావో (364 మ్యాచుల్లో), ఇమ్రాన్ తాహిర్ (320 మ్యాచుల్లో), సునీల్ నరైన్ (362 మ్యాచుల్లో) మాత్రమే టీ20ల్లో 400 వికెట్లు పడగొట్టారు.
బ్రావో.. టీ20 ఫార్మాట్లో మొత్తం 553 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత నరైన్ (425), తాహిర్ (420), రషీద్ (400) ఉన్నారు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్ల సాధించిన ఘనత కూడా ఈ టోర్నీలోనే సొంతం చేసుకున్నాడు రషీద్. అతడు కేవలం 53 మ్యాచుల్లోనే 100 వికెట్లు పడగొట్టి.. శ్రీలంక పేస్ దిగ్గజం లసిత్ మలింగను (76 మ్యాచుల్లో) అధిగమించాడు.
ఇదీ చూడండి: అఫ్గాన్‌పై న్యూజిలాండ్ విజయం.. ఇండియా ఇంటికి