టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) భాగంగా ఇప్పటివరకు టీమ్ఇండియా ఒకే మ్యాచ్ ఆడింది. తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌పై(IND vs PAK T20) 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో భారత జట్టును తక్కువ అంచనా వేయడం సరికాదని అన్నాడు మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. ఒక్కసారి ఊపందుకుంటే.. కోహ్లీసేనను ఏ జట్టు ఎదుర్కోలేదని అని ట్వీట్ చేశాడు.
"టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ముందుకెళ్లడం కష్టమని చాలా మంది భావిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక్క ఓటమితోనే ఈ నిర్ణయానికి రావడం సరికాదు. రాబోయే మ్యాచ్ భారత జట్టు భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒక్కసారి భారత్ ఊపందుకుంటే ఇక వారిని ఆపడం ఎవరివల్లా కాదు."
--దినేశ్ కార్తీక్, టీమ్ఇండియా మాజీ ఆటగాడు.
మరికొన్ని గంటల్లో టీమ్ఇండియా.. న్యూజిలాండ్‌తో(IND vs NZ T20 Match) తలపడనుంది. ఈ మ్యాచ్ గెలవడం ఇరు జట్లకూ చాలా ముఖ్యం. ఈ పోరులో నెగ్గిన వారికే సెమీస్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దినేశ్ కార్తీక్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
-
It's amazing and equally perplexing to see TEAM INDIA not being counted in many people's thoughts in moving forward in this tournament so far after just one match in one week.
— DK (@DineshKarthik) October 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
This WEEK is the ultimate week and if India gets on a roll , nothing to stop them.
MOMENTUM is key
">It's amazing and equally perplexing to see TEAM INDIA not being counted in many people's thoughts in moving forward in this tournament so far after just one match in one week.
— DK (@DineshKarthik) October 31, 2021
This WEEK is the ultimate week and if India gets on a roll , nothing to stop them.
MOMENTUM is keyIt's amazing and equally perplexing to see TEAM INDIA not being counted in many people's thoughts in moving forward in this tournament so far after just one match in one week.
— DK (@DineshKarthik) October 31, 2021
This WEEK is the ultimate week and if India gets on a roll , nothing to stop them.
MOMENTUM is key
ఆ నాలుగు జట్లే..
ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లేదా భారత్, పాకిస్థాన్ జట్లు టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడే అవకాశాలున్నాయని ఇటీవలే అంచనా వేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, టీమ్ఇండియా, పాకిస్థాన్ జట్లు సెమీస్ చేరుకుంటాయని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి:
T20 World Cup: వరుణ్ స్థానంలో అశ్విన్.. నాలుగో ఆటగాడిగా జడ్డూ!