ETV Bharat / sports

'కర్మ హిట్స్ బ్యాక్'.. అప్పుడు కివీస్.. ఇప్పుడు ఇంగ్లాండ్! - అప్పుడు కివీస్.. ఇప్పుడు ఇంగ్లాండ్!

టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్​లో విజయం సాధించి ఫైనల్​కు దూసుకెళ్లింది న్యూజిలాండ్. అయితే 2019 వన్డే ప్రపంచకప్​లో జరిగిన ఓ సంఘటన.. మళ్లీ ఈ టోర్నీలో పునరావృతమైంది. కానీ అప్పుడు బలైంది న్యూజిలాండ్ అయితే.. ఇప్పుడు దాని ఫలితం అనుభవించింది ఇంగ్లాండ్. అదేంటో చూసేయండి.

NZ vs ENG
కివీస్
author img

By

Published : Nov 11, 2021, 12:47 PM IST

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో కివీస్‌ విజయం సాధించింది. తద్వాారా పొట్టి ఫార్మాట్లో తొలిసారి ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అయితే 2019 ప్రపంచకప్​ ఫైనల్లో ఈ రెండు జట్లు పోటీపడగా అందులో ఇంగ్లీష్ టీమ్ గెలిచింది. అందుకు తాజాగా జరిగిన సెమీస్​లో గెలుపుతో ప్రతీకారం తీర్చుకుంది కివీస్. ఇక్కడ ఒక ఆసక్తికర విషయమేంటంటే.. వన్డే ప్రపంచకప్​లో స్టోక్స్, ఈ మెగాటోర్నీలో నీషమ్​.. ఇద్దరూ బౌండరీ లైన్ వద్ద చేసిన తప్పిదంతో బతికిపోయి వారి వారి జట్టుకు విజయాన్ని అందించారు. తాజాగా ఈ అరుదైన సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది.

ఏం జరిగింది?

2019 ప్రపంచకప్

ఈ ప్రపంచకప్​లో భాగంగా రెండో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్ విజయానికి అప్పటికి 9 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉంది. 49వ ఓవర్​ 4 బంతిని నీషమ్ బౌలింగ్​లో బౌండరీ బాదాడు స్టోక్స్. ఆ బంతిని బౌండరీ వద్ద అద్భుతంగా ఒడిసిపట్టాడు బౌల్ట్. కానీ అదుపుతప్పి బౌండరీ లైన్​పై కాలు పడటం వల్ల దానిని సిక్స్​గా ప్రకటించారు అంపైర్లు. దీంతో బతికిపోయిన స్టోక్స్.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

2021 టీ20 ప్రపంచకప్

167 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆదిలోనే తడబాటుకు గురైంది. నీషమ్ వచ్చాక స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. క్రిస్‌ జోర్డాన్ వేసిన 17వ ఓవర్లో జిమ్మీ నీషమ్‌ (27) చెలరేగిపోయాడు. రెండు సిక్సులు, ఓ ఫోర్‌తో విధ్వంసం సృష్టించడం వల్ల ఫలితం మారిపోయింది. తొలి బంతికి సిక్స్ బాదిన నీషమ్‌, మూడో బంతిని ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతికే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద ఉన్న జానీ బెయిర్‌ స్టోకు చిక్కాడు. అయితే, బంతిని చేతుల్లోకి తీసుకొనే క్రమంలో అతడు బౌండరీ లైన్‌ను తాకడం వల్ల.. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఆ ఓవర్లో నీషమ్‌ రెండు సిక్సులు, ఓ ఫోర్‌ సహా మొత్తం 23 పరుగులు రాబట్టాడు. న్యూజిలాండ్‌ జట్టులో ఫైనల్‌పై ఆశలు చిగురించాయి. ఆ తర్వాతి ఓవర్లో నీషమ్‌ ఔటైనా.. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ డెరిల్‌ మిచెల్ (72) జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. ఆ ఓవర్లో నీషమ్‌ ఔటై ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో.! ఈ రెండు సంఘటనలకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన అధికారిక ఇన్‌స్టా ఖాతాలో పంచుకుంది. మీరూ చూసేయండి..!

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంగ్లాండ్​పై న్యూజిలాండ్ సరైన ప్రతీకారం తీర్చుకుందంటూ కామెంట్లు పెడుతున్నారు. 'కర్మ హిట్స్ బ్యాక్' అంటూ ఆ రెండు ఫొటోలను జోడిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'పాకిస్థాన్ ఫేవరెట్.. ఆసీస్​తో ప్రమాదమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.