ETV Bharat / sports

స్మిత్​పై షేన్​ వార్న్ విమర్శలు.. అభిమానులు గుస్సా

ఆస్ట్రేలియా బ్యాటర్​ స్టీవ్ స్మిత్​పై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆ జట్టు మాజీ ఆటగాడు షేన్ వార్న్(Shane Warne Steve Smith). టీ20 జట్టులో స్టీవ్​ స్మిత్​ను(Steve Smith News) ఆడించొద్దని ట్వీట్ చేశాడు. దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇంగ్లాండ్​తో ఓడిపోయినంత మాత్రాన ఆసీస్​ జట్టు గొప్పదికాకుండా పోదని, టీ20ల్లో ఇప్పటికీ ఆస్ట్రేలియా మేటి జట్టే అని కెప్టెన్ ఆరోన్​ ఫించ్​ అన్నాడు.

warne, smith
షేన్ వార్న్, స్మిత్
author img

By

Published : Oct 31, 2021, 5:37 PM IST

స్పిన్‌ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్‌వార్న్‌(Shane Warne News) తాజాగా ట్విటర్‌ వేదికగా చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లో ఒకరైన స్టీవ్‌స్మిత్‌(Shane Warne Steve Smith) టీ20 జట్టులో ఉండకూడదని అన్నాడు. శనివారం(అక్టోబర్​ 30) రాత్రి ఆసీస్‌.. ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న నేపథ్యంలో వార్న్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

"జట్టు ఎంపిక బాలేదు. మార్ష్​ను పక్కనపెట్టడం బాధ కలిగించింది. మ్యాక్స్​వెల్​ స్థానంలో స్టోయినిస్​ బరిలోకి దిగాలి. మ్యాక్సీ ఎప్పుడైనా పవర్​ ప్లే తర్వాతే ఆడాలి. ఆసీస్ జట్టు ప్రణాళిక కూడా బాలేదు. స్మిత్​ అంటే ఇష్టమే. కానీ, అతడు టీ20 జట్టులో ఉండకూడదు. అతడి స్థానంలో మార్ష్​ను ఎంపిక చేయాలి."

--షేన్ వార్న్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(AUS vs ENG T20) తొలుత బ్యాటింగ్ చేసి 125 పరుగులకే ఆలౌటైంది. టాప్‌ఆర్డర్‌లో కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (44) మినహా ఎవరూ పరుగులు చేయలేదు. డేవిడ్‌ వార్నర్‌ (1), స్టీవ్‌స్మిత్‌ (1), మాక్స్‌వెల్‌ (6), స్టాయినిస్ (0) పూర్తిగా విఫలమయ్యారు. ఇక మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ తలా కొన్ని పరుగులు చేయడం వల్ల ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్‌ సాధించింది. అనంతరం ఇంగ్లాండ్‌ 11.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బట్లర్‌ (71; 32 బంతుల్లో 5x4, 5x6) దంచికొట్టాడు. ఈ నేపథ్యంలోనే వార్న్‌ ట్వీట్‌ చేస్తూ ఆసీస్‌ జట్టును ఎండగట్టాడు. ఈ ట్వీట్‌పై ఆసీస్‌ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. స్మిత్‌ ఇదొక్క మ్యాచ్‌లోనే విఫలమయ్యాడని, ఇలాంటి పనికిమాలిన సూచనలు చేయొద్దని అతడిపై మండిపడుతున్నారు.

  • Disappointing selection from Australia leaving Marsh out & Maxwell batting in the power play (he should always come in after power play). Stoinis should have gone in. Poor strategy & tactics from the Aussies. I love Smith but he shouldn’t be in the T/20 team. Marsh has to be !!

    — Shane Warne (@ShaneWarne) October 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఏం పర్లేదు.. మేటి జట్టే

టీ20 క్రికెట్లో 'ఇప్పటికీ అస్ట్రేలియా మేటి జట్టే' అని ఆ దేశ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్(Finch News) అన్నాడు. టీ20 ప్రపంచకప్​లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్​లో ఇంగ్లాండ్​పై ఆసీస్ ఓటమి పాలైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. రానున్న పోటీల్లో ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో చేసిన పొరపాట్లను పునరావృతం చేయమని పేర్కొన్నాడు.

నవంబర్​ 4న బంగ్లాదేశ్​తో, నవంబర్ 6న వెస్టిండీస్​తో తలపడనుంది ఆస్ట్రేలియా. ఈ నేపథ్యంలో ఇరు జట్లతో గెలవడం అవసరమని తెలిపాడు ఫించ్. 'బంగ్లాదేశ్, విండీస్ జట్లు దృఢంగా ఉన్నాయి. అయినా పూర్తి విశ్వాసంతో ఆడేందుకే ప్రయత్నిస్తాం' అని ఫించ్ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:

T20 World Cup: వరుణ్ స్థానంలో అశ్విన్.. నాలుగో ఆటగాడిగా జడ్డూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.