క్రికెట్లో టీ20 మ్యాచ్‌లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మ్యాచ్ ఏ దశలో ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇలాంటి తరుణంలో కెప్టెన్ తీసుకునే నిర్ణయాలే మ్యాచ్ గెలుపోటములను నిర్ణయిస్తాయి. ఓ క్రికెటర్ ఉత్తమ టీ20 ఆటగాడిగా రాణించినప్పటికీ ఉత్తమ సారథిగా విఫలమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే టీ20ల్లో అత్యధిక విజయాలు తమ ఖాతాలో వేసుకున్న ఉత్తమ కెప్టెన్లు(Best T20 Captain) ఎవరో చూసేద్దాం..
1. ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్
అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో ఎంఎస్ ధోనీ, అస్గర్ అఫ్గాన్‌ను వెనక్కినెట్టి అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా నిలిచాడు ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్(Eoin Morgan T20 Captaincy Record). మొత్తం 70 మ్యాచ్‌ల్లో 43 విజయాలను నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో విజయం అనంతరం ఈ ఘనత సాధించాడు మోర్గాన్.
ఒకవేళ టీ20 ప్రపంచకప్ టైటిల్ ఇంగ్లాండ్ సొంతం చేసుకుంటే ఇయాన్ మోర్గాన్‌కు టీ20 చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది.
2. ఎంఎస్ ధోనీ, ఇండియా
టీమ్ఇండియా మెంటార్, భారత జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ(Dhoni Captaincy) ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్ మహీ కావడం విశేషం.
2007 నుంచి 2016 వరకు 72 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ధోనీ 42 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... 28 మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాడు. 2 మ్యాచ్‌ల ఫలితం తేలలేదు. టీ20 మ్యాచ్‌ల్లో సారథిగా మహీ గెలుపు శాతం 60గా ఉంది.
3. అస్గర్ అఫ్గాన్, అఫ్గానిస్థాన్
అఫ్గానిస్థాన్ జట్టు మాజీ సారథి అస్గర్ అఫ్గాన్(Asghar Afghan Retirement) ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా ఆడాడు. అయితే.. టీ20ల్లో కెప్టెన్‌గా సక్సెస్ అయిన జాబితాలోనూ అస్గర్ చోటు సంపాదించాడు.
అస్గర్ సారథ్యంలో 51 టీ20 మ్యాచ్‌లాడిన అఫ్గానిస్థాన్ 42 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కెప్టెన్‌గా అస్గర్ గెలుపు శాతం 81.73గా ఉంది.
4. విరాట్ కోహ్లీ, ఇండియా
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ అత్యుత్తమ టీ20 కెప్టెన్ల జాబితాలో(Best T20 Captain of India) నాలుగో స్థానంలో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా స్కాట్లాండ్పై గెలుపు అనంతరం.. కోహ్లీ(Virat Captaincy) సారథ్యంలో భారత్ గెలిచిన విజయాలు 31కి చేరాయి.
48 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు సారథ్యం వహించిన విరాట్ మొత్తంగా 31 విజయాలు సాధించాడు. కాగా.. టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు టోర్నీ ముందే ప్రకటించాడు.
5. సర్ఫరాజ్ అహ్మద్, పాకిస్థాన్
టీ20ల్లో పాకిస్థాన్ జట్టును అత్యధిక సార్లు విజయతీరాలకు చేర్చిన సారథిగా నిలిచాడు మాజీ కెప్టెన్ సర్ఫరాజ్(Sarfaraz Captaincy Record) అహ్మద్. మొత్తంగా 37 మ్యాచ్‌ల్లో పాక్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న అతడు 29 సార్లు విజయం సాధించాడు.
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లోనూ(T20 World Cup 2021) పాకిస్థాన్ జట్టులో చోటు సంపాదించాడు సర్ఫరాజ్. కానీ, ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఇతర దిగ్గజాలు..
షాహిద్ అఫ్రిది, బ్రెండన్ మెక్‌కలమ్, కీరన్ పొలార్డ్, లసిత్ మలింగ, ముష్ఫికర్ రహీమ్, షకిబ్ అల్ హసన్, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, మాథ్యూస్ మొదలైన దిగ్గజ ఆటగాళ్లూ తమ టీ20 జట్లకు సారథ్యం వహించారు. కానీ, వారి గెలుపు శాతం 50 కన్నా తక్కువే ఉండటం గమనార్హం.
ఇవీ చదవండి:
IND vs SCO T20: స్కాట్లాండ్తో మ్యాచ్.. నమోదైన రికార్డులివే!