మార్చి 16న ఆసియన్ ఒలింపిక్ క్వాలిఫయర్ కోసం ఒక్క రోజు ట్రయల్స్‌ను నిర్వహించనుంది భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ). ఇందిరా గాంధీ క్రీడా కాంప్లెక్స్‌లో నిర్వహించే ఈ ట్రయల్స్‌లో ప్రముఖ భారత రెజ్లర్లు పాల్గొననున్నారు.
డబ్ల్యూఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రారంభించే ఈ ట్రయల్స్‌లో ఒలింపిక్, ఒలింపికేతర అథ్లెట్లను ఎంపిక చేయనున్నారు. ఈ క్రీడల్లో పాల్గొనే ఆటగాళ్లకు రెండు కేజీల అదనపు గ్రేస్ పాయింట్లు ఇస్తారు. కజకిస్థాన్ ఆల్మటీలో ఏప్రిల్ 9 నుంచి 18 వరకు ఈ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి.
ప్రపంచ కాంస్య పతక విజేత నర్సింగ్ యాదవ్, జాతీయ ఛాంపియన్ సందీప్ సింగ్ 74 కేజీల విభాగం నుంచి ఈ ట్రయల్స్‌లో స్థానం కోసం పోటీ పడనున్నారు.
టోక్యో ఒలింపిక్స్ అర్హత ఈవెంట్ అయిన ఈ ట్రయల్స్‌లో.. ప్రతి వెయిట్ విభాగంలో ఒక్క రెజ్లర్‌కే అవకాశం ఇవ్వనున్నారు. ఈ ట్రయల్స్‌లో ప్రధాన ఆకర్షణగా సత్యవర్త్ కడియన్ (97 కేజీ), సుమిత్ మలిక్ (125 కేజీ), బజ్రంగ్ పూనియా (65 కేజీ), రవి దహియా (57 కేజీ), దీపక్ పూనియా (86 కేజీ) నిలువనున్నారు. వీరిప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హ త సాధించారు. మహిళల తరఫున 53 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
ఇదీ చదవండి: దుబాయ్ ఏటీపీ టోర్నీ నుంచి తప్పుకున్న ఫెదరర్