ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్షిప్ లాంగ్ జంప్‌లో వరల్డ్ రికార్డు నెలకొల్పాడు జమైకా క్రీడాకారుడు తాజే గేల్. ఖతర్ దోహా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో 8.69 మీటర్లు దూకి సంచలనం సృష్టించాడు. గతంలో జమైకాకే చెందిన జేమ్స్ బ్యాక్ఫోర్డ్(8.62 మీటర్లు) రికార్డు బద్దలు కొట్టి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.
-
Jamaican record AND longest wind-legal jump in the world for the last ten years...Tajay Gayle’s 8.69m is ridiculous.
— FloTrack (@FloTrack) September 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
pic.twitter.com/0spWleX1pY
">Jamaican record AND longest wind-legal jump in the world for the last ten years...Tajay Gayle’s 8.69m is ridiculous.
— FloTrack (@FloTrack) September 28, 2019
pic.twitter.com/0spWleX1pYJamaican record AND longest wind-legal jump in the world for the last ten years...Tajay Gayle’s 8.69m is ridiculous.
— FloTrack (@FloTrack) September 28, 2019
pic.twitter.com/0spWleX1pY
ఐదో అవకాశంలో ఈ ఘనత అందుకున్నాడు తాజే. తొలి జంప్‌లో 8.46 మీటర్లు దూకాడు. టోర్నీలో గెలవడానికి ఆ రికార్డే సరిపోతుంది. కానీ ఈ 23 ఏళ్ల జమైకన్ అథ్లెట్ అంతటితో ఆగకుండా 8.69 మీటర్ల దూకి సత్తాచాటాడు.
2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న తాజే అనంతరం పుంజుకున్నాడు. ఈ ఏడాది జరిగిన పాన్ ఆమ్ గేమ్స్‌లో రజతం నెగ్గాడు. ఆ టోర్నీలో స్వర్ణం గెలిచిన జువాన్ మిగ్వెల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మూడో స్థానానికే పరిమితమయ్యాడు.
ఇదీ చదవండి: ఫైనల్లో భారత మిక్స్డ్ రిలే జట్టు.. ద్యుతి ఔట్