ప్రపంచ మహిళల టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో(World Chess Championship 2021) భారత జట్టు క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. బుధవారం ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 3-1తో ఫ్రాన్స్‌పై విజయం సాధించిన భారత్ గ్రూప్-ఎలో రెండో స్థానంలో నిలిచి ముందంజ వేసింది. భక్తి కులకర్ణి(Bhakti Kulkarni Chess), మేరీ ఆన్ గోమ్స్ విజయం సాధించి జట్టును గెలిపించారు. భక్తి 51 ఎత్తుల్లో నటాచ బెన్మెస్బాను ఓడించగా.. మేరీ కూడా 51 ఎత్తుల్లో సిల్వియా అలెక్సీవాపై నెగ్గింది. మేరీ సెబగ్‌తో గేమ్‌ను హారిక, అండ్రియా నవ్రోటెస్కుతో గేమ్‌ను తానియా సచ్‌దేవ్ డ్రాగా ముగించారు.
అంతకుముందు నాలుగో రౌండ్లో భారత్ 1-3తో టాప్ సీడ్ రష్యా చేతిలో పరాజయంపాలైంది. గ్రూప్‌లో మూడు విజయాలు, ఒక డ్రా, ఒక ఓటమితో మొత్తం 7 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్‌ఫైనల్లో భారత్.. కజకిస్థాన్‌ను ఢీకొననుంది. అమెరికాతో రష్యా, ఉక్రెయిన్‌తో అర్మేనియా, జార్జియాతో అజర్‌బైజాన్ తలపడనున్నాయి.
ఇదీ చూడండి.. Pink Test: 'గులాబి బంతితో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాం'