ETV Bharat / sports

భారత అథ్లెట్​ అద్భుతం.. పతకంతో ఫెలిక్స్​ అల్విదా! - allyson felix

World athletics championships 2022: ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో భారత క్రీడాకారుడ మురళీ శ్రీశంకర్​ అదరగొట్టాడు. లాంగ్​జంప్​​ అర్హత రౌండ్లో 8 మీటర్లు దూకి ఫైనల్​కు చేరాడు. ఇతర భారత అథ్లెట్లు జెస్విన్‌ అల్డ్రిన్‌, మహ్మద్‌ అనీస్‌ అర్హత రౌండ్లోనే నిష్క్రమించారు. మరోవైపు అమెరికా దిగ్గజ అథ్లెట్‌ అలిసన్‌ ఫెలిక్స్‌ తన ఉజ్వల కెరీర్‌కు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకంతో వీడ్కోలు పలికింది. మిక్స్​డ్​ రిలే రేసులో కాంస్యం అందుకుంది ఫెలిక్స్.

ఫెలిక్స్
ఫెలిక్స్​
author img

By

Published : Jul 17, 2022, 7:08 AM IST

World athletics championships 2022: భారత లాంగ్‌జంప్‌ స్టార్‌ మురళీ శ్రీశంకర్‌ సత్తా చాటాడు. అద్భుత ప్రదర్శన చేస్తూ ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అర్హత రౌండ్లో 8 మీటర్లు (రెండో ప్రయత్నం) దూకిన 23 ఏళ్ల మురళీ గ్రూప్‌-బిలో రెండో స్థానం.. మొత్తం మీద ఏడో స్థానంతో ముందంజ వేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో లాంగ్‌జంప్‌లో పురుషుల విభాగంలో ఫైనల్‌ చేరిన తొలి భారత అథ్లెట్‌గా శ్రీశంకర్‌ ఘనత సాధించాడు. ఈ గ్రూప్‌లో ఒలింపిక్‌ ఛాంపియన్‌ మిల్టియాడిస్‌ (8.03 మీ, గ్రీస్‌) అగ్రస్థానంలో నిలిచాడు. మిల్టియాడిస్‌, శ్రీశంకర్‌ మాత్రమే ఈ గ్రూపులో 8 మీటర్లపైన దూకారు. ఈ ఏప్రిల్‌లో ఫెడరేషన్‌ కప్‌లో 8.36 మీటర్లు దూకిన శ్రీశంకర్‌.. ఫైనల్లో ఆ స్థాయి ప్రదర్శన చేసినా పతకం ఆశించొచ్చు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు లభించిన ఏకైక పతకం లాంగ్‌జంప్‌లోనే రావడం విశేషం. 2003లో అంజుబాబి జార్జి కాంస్యం నెగ్గింది. మరోవైపు లాంగ్‌జంప్‌లో పోటీపడిన భారత ఇతర అథ్లెట్లు జెస్విన్‌ అల్డ్రిన్‌, మహ్మద్‌ అనీస్‌ అర్హత రౌండ్లోనే నిష్క్రమించారు. గ్రూప్‌-ఏలో పోటీపడిన జెస్విన్‌ (7.79 మీ) ఏడో స్థానం, అనీస్‌ (7.73 మీ) పదకొండో స్థానంలో నిలిచారు. పురుషుల 3 వేల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్‌ సాబ్లే ఫైనల్‌ చేరాడు. హీట్స్‌-3లో పోటీపడిన అతడు 8 నిమిషాల 18.75 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంతో ముందంజ వేశాడు.

నిరాశపరిచిన ప్రియాంక, సందీప్‌: 20 మీటర్ల నడకలో జాతీయ రికార్డు కలిగి ఉన్న ప్రియాంక గోస్వామి, సందీప్‌ కుమార్‌ నిరాశపరిచారు. మహిళల విభాగంలో ప్రియాంక.. 1 గంట 39 నిమిషాల 42 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 36 మంది పోటీపడిన రేసులో 34వ స్థానంలో నిలిచింది. పురుషుల్లో సందీప్‌ కుమార్‌ ఇంకా దారుణమైన ప్రదర్శన చేశాడు. గంటా 31 నిమిషాల 58 సెకన్లలో ఫినిషింగ్‌ లైన్‌ చేరిన అతడు 43 మంది అథ్లెట్లు పోటీపడిన రేసులో 40వ స్థానంలో నిలిచాడు. షాట్‌పుట్‌ స్టార్‌ తజిందర్‌పాల్‌ తూర్‌ పోటీకి దిగకుండానే గజ్జల్లో గాయంతో తప్పుకున్నాడు. నాలుగు రోజుల క్రితమే అతడికి ఈ గాయం కాగా.. నొప్పి తగ్గకపోవడంతో పోటీ నుంచి విరమించాడు. ఈ నెల 28న ఆరంభమయ్యే కామన్వెల్త్‌ క్రీడలకు కూడా అతడు దూరమయ్యాడు.

పతకంతో గుడ్​బై
Allyson felix: అమెరికా దిగ్గజ అథ్లెట్‌ అలిసన్‌ ఫెలిక్స్‌ తన ఉజ్వల కెరీర్‌కు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకంతో వీడ్కోలు పలికింది. 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో కాంస్యం గెలిచిన అమెరికా జట్టులో 36 ఏళ్ల ఫెలిక్స్‌ సభ్యురాలిగా ఉంది. ఫైనల్లో ఫెలిక్స్‌, గాడ్‌విన్‌, నార్‌వుడ్‌, సిమోన్‌లతో కూడిన అమెరికా బృందం 3 నిమిషాల 10.16 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ రేసులో గాడ్‌విన్‌ నుంచి బ్యాటన్‌ అందుకుని రెండో లెగ్‌లో తన శైలిలో దూసుకుపోయింది ఫెలిక్స్‌. అప్పుడు అమెరికా పసిడి రేసులో ఉంది. కానీ ఆఖరి లెగ్‌లో సహచర అథ్లెట్‌ తడబడడంతో అలిసన్‌ కాంస్యంతో సంతృప్తి పడింది. అమ్మ అయిన తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన ఫెలిక్స్‌.. తన కెరీర్‌లో చివరి రేసులోనూ సత్తా చాటి పోడియంపై నిలిచింది. ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఫెలిక్స్‌కు ఇది 19వ పతకం. వీటిలో 13 స్వర్ణ పతకాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ఆమె ఖాతాలో రికార్డు స్థాయిలో 11 ఒలింపిక్స్‌ పతకాలు (7 స్వర్ణ, 3 రజత, 1 కాంస్యం) ఉన్నాయి.

ఆగిన చికెన్‌ లెగ్స్‌: ప్రపంచ అథ్లెటిక్స్‌ చరిత్రలో గొప్ప అథ్లెట్ల జాబితాలో కచ్చితంగా ఉండే పేరు అలిసన్‌ ఫెలిక్స్‌. అందుకామె ఘనతలు.. సాధించిన రికార్డులే కారణం! మహిళల స్ప్రింట్‌లో తనదైన ముద్ర వేసిన ఫెలిక్స్‌ చాలా ఏళ్లు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ను ఏలింది. 2005 నుంచి మొదలుపెట్టి వరుసగా ఒలింపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకాలతో హోరెత్తించింది. సన్నటి కాళ్లు ఉండడంతో చికెన్‌ లెగ్స్‌ అని అందరూ ముద్దుగా పిలిచే ఈ స్ప్రింటర్‌ తన కెరీర్‌లో ముఖ్యంగా 200, 400 మీటర్ల పరుగులో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక 100 మీటర్ల రిలేలో ఒలింపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో అమెరికా పసిడి పంట పండించడంలో ఫెలిక్స్‌ది ముఖ్య పాత్ర. ఈ క్రమంలో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో అత్యధిక పతకాలు సాధించిన అమెరికా దిగ్గజం కార్ల్‌ లూయిస్‌ (10)ను అధిగమించి చరిత్ర సృష్టించింది. 2018లో తల్లి అయిన తర్వాత ఆమె పని అయిపోందని అంతా భావించారు. కానీ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగులో కాంస్యం గెలిచిన ఆమె.. ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్‌లో కాంస్యంతో కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది.

100 మీ.లో స్టార్లు ముందంజ: పురుషుల 100 మీటర్ల పరుగులో స్టార్‌ అథ్లెట్లు యెహాన్‌ బ్లేక్‌, ఆండ్రీ డిగ్రాస్‌, క్రిస్టియన్‌ కోల్‌మ్యాన్‌ సెమీఫైనల్లో ప్రవేశించారు. హీట్స్‌-6లో కోల్‌మన్‌ (10.08 సె) అగ్రస్థానంలో నిలవగా, డిగ్రాస్‌ (10.12 సె) రెండో స్థానం సాధించాడు. హీట్స్‌-5లో బ్లేక్‌ (10.04 సె) రెండో స్థానంలో నిలిచాడు. హీట్స్‌-2లో పోటీపడిన అమెరికా స్ప్రింటర్‌ ఫ్రెడ్‌ కెర్లీ (9.79 సె) అందరికంటే ఉత్తమమైన టైమింగ్‌ సాధించాడు. ప్రపంచంలో అత్యుత్తమ టైమింగ్‌ కలిగిన వాళ్లలో ఏడో స్థానంలో ఉన్న ఫెర్డినాండ్‌ (కెన్యా) కూడా ఫైనల్‌ చేరాడు. వీసా ఆలస్యం కారణంగా కేవలం రెండు గంటల ముందు పోటీ వేదికకు చేరుకోగలిగిన అతడు 10.10 సెకన్లలో లక్ష్యం చేరి సెమీస్‌ చేరాడు. పురుషుల 20 కి.మీ నడకలో తొషికాజు (జపాన్‌) టైటిల్‌ నిలబెట్టుకున్నాడు. అతడు గంట 19 నిమిషాల 7 సెకన్లలో రేసు పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు.

ఇదీ చూడండి : అమెరికా జట్టులో ఆంధ్ర ప్లేయర్​.. ​అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.