ETV Bharat / sports

'ఫిఫా వరల్డ్ కప్'​లో మహిళల హవా మొదలు.. పురుషుల విభాగానికి రిఫరీలుగా..

ఫుట్‌బాల్‌ ఒలింపిక్స్‌ లాంటి 'ఫిఫా వరల్డ్‌కప్‌' పురుషుల విభాగానికి ఎప్పుడూ మహిళా రిఫరీలు లేరు. మరి ఇకనైనా అవకాశం ఇవ్వాలిగా అని ఆలోచించింది ఫిఫా రిఫరీస్‌ కమిటీ! అలా 92 ఏళ్ల చరిత్ర ఉన్న ఫిఫా మెన్స్‌ వరల్డ్‌ కప్‌లో మహిళల శకం ప్రారంభమైంది. ఈ నెల ఖతార్‌లో నిర్వహిస్తోన్న పోటీలకు ఎంపికైన మహిళా రిఫరీల గురించి తెలుసుకుందాం రండి.

qatar fifa world cup
qatar fifa world cup
author img

By

Published : Nov 18, 2022, 10:04 AM IST

FIFA World Cup: ఫుట్‌బాల్‌ ఆటకి మహిళా రిఫరీలు లేరా? ఉన్నారు.. మహిళలవాటితోపాటు పురుషుల లీగ్‌లెన్నింటికో పనిచేశారు కూడా! కానీ ఫుట్‌బాల్‌ ఒలింపిక్స్‌ లాంటి 'ఫిఫా వరల్డ్‌కప్‌' అందులోనూ పురుషుల విభాగానికి ఎప్పుడూ మహిళా రిఫరీలు లేరు. మరి ఇకనైనా అవకాశం ఇవ్వాలిగా అని ఆలోచించింది ఫిఫా రిఫరీస్‌ కమిటీ! అలా 92 ఏళ్ల చరిత్ర ఉన్న ఫిఫా మెన్స్‌ వరల్డ్‌ కప్‌లో మన శకం ప్రారంభమైంది. ఈ నెల ఖతార్‌లో నిర్వహిస్తోన్న పోటీలకు ఎంపికైన మహిళా రిఫరీలు వీళ్లు..

ఒలింపిక్‌ అనుభవం..: యషిమి యమషిత
జపాన్‌కు చెందిన యమషితకిది రెండో వరల్డ్‌కప్‌! 2019 ఫ్రాన్స్‌లో నిర్వహించిన విమెన్స్‌ వరల్డ్‌కప్‌కి రిఫరీగా చేసింది. 2020 ఒలింపిక్స్‌లో అమెరికా, స్వీడన్‌ మ్యాచ్‌కీ పనిచేసింది. ఫిఫాకే కాదు.. ఏఎఫ్‌సీ ఛాంపియన్స్‌ లీగ్‌, జే1 లీగ్‌లకు రిఫరీగా చేసిన తొలి మహిళా రిఫరీగానూ చరిత్రలో నిలిచింది. 'తొలి ప్రయత్నం.. ఒత్తిడి సహజమే! అయితే మధ్యతూర్పు దేశాల్లో మహిళా రిఫరీల ఉనికే తక్కువ. ఆ పరిస్థితిలో మార్పు నాతో ప్రారంభమవుతుందనుకుంటున్నా. పురుషుల ఆటలో మహిళా రిఫరీలకు స్థానం.. అమ్మాయిలకు పెరుగుతోన్నప్రాధాన్యానికి చిహ్నంగా భావిస్తున్నా'నంటోంది 36 ఏళ్ల యమషిత.

ఆటపై ప్రేమతో..: సలీమా ముకన్సంగా
'నాకు బాస్కెట్‌ బాల్‌ అంటే చాలా ఇష్టం. దీన్ని సీరియస్‌గా కెరియర్‌గా తీసుకోవాలనుకున్నా. కానీ సరైన మౌలిక సదుపాయాలు లేవు. అందుకే నా ప్రేమను రిఫరీయింగ్‌వైపు మళ్లించా’నని చెబుతోందీ 34 ఏళ్ల రువాండా మహిళ. 24 ఏళ్ల వయసులో ఫిఫా అధికారిక రిఫరీ అయ్యింది. 2019 విమెన్స్‌ వరల్డ్‌కప్‌, టోక్యో ఒలింపిక్స్‌ల్లో సత్తాచాటిన తను ఈ ఏడాది విమెన్స్‌ ఆఫ్రికా కప్‌ ఆఫ్‌ నేషన్స్‌కీ పనిచేసింది.

మూడుసార్లు బెస్ట్‌ రిఫరీ: స్టెఫనీ ఫ్రపార్ట్‌
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అతి తక్కువ మహిళా రిఫరీల్లో ఈమె ఒకరు. 2019.. ఫ్రాన్స్‌లో నిర్వహించిన వరల్డ్‌కప్‌కి, యూఈఎఫ్‌ఏ సూపర్‌ కప్‌ ఫైనల్‌కీ రిఫరీగా చేసింది. 2020 నుంచి ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. 2020 మెన్స్‌ ఛాంపియన్‌ లీగ్‌, ఆ తర్వాతి ఏడాది విమెన్స్‌ యూసీఎల్‌లకు పనిచేసింది. ఈ ఏడాదీ కప్‌ డీ ఫ్రాన్స్‌ ఫైనల్‌కీ రిఫరీ తను. 2019 నుంచి ఐఎఫ్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ వరల్డ్స్‌ బెస్ట్‌ విమెన్‌ రిఫరీగా వరుసగా మూడుసార్లు నిలిచిందీ 38 ఏళ్ల ఫ్రెంచ్‌ మహిళ. 'ఆడవాళ్లకు పెరుగుతున్న ప్రాధాన్యానికి బలమైన సూచికే ఇది'అంటోంది.
వీళ్లే కాదు.. ఫిఫా వరల్డ్‌కప్‌కి మరో ముగ్గురు మహిళలు ఎంపికయ్యారు. అయితే వాళ్లు అసిస్టెంట్‌ రిఫరీలు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.