టోక్యో ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) బెర్తు కోసం శ్రమిస్తున్న భారత అథ్లెట్ హిమదాస్‌కు(HimaDas) ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా మెగాక్రీడలకు అర్హత సాధించలేకపోయింది. ఈ విషయాన్ని ఆమె ట్వీట్ చేసి ఆవేదన వ్యక్తం చేసింది. బలంగా పుంజుకుని ఆసియన్ గేమ్స్(2022), కామన్వెల్త్ గేమ్స్(2022)లో బరిలో దిగుతానని చెప్పింది.
"అర్హత పోటీ 100మీ, 200మీ రౌండ్లో లక్ష్యానికి చేరువగా ఉన్న సమయంలో గాయం అవ్వడం వల్ల ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం చేజారిపోయింది. నాకు అండగా నిలిచిన కోచ్, సహాయక సిబ్బంది, సహ ఆటగాళ్లకు కృతజ్ఞతలు" అని హిమదాస్ చెప్పింది.
జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హీట్ విభాగంలో పోటీ పడుతుండగా ఆమె కాలికి గాయమైంది. ఈ గాయం తీవ్రత ఎక్కువ అవ్వడం, 4x100మీటర్ రౌండ్లో తమ బృందం నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని పూర్తిచేయలేకపోడం వల్ల మెగాక్రీడలకు ఆమె అర్హత సాధించే అవకాశం చేజారిపోయింది.
ఇదీ చూడండి: ప్రపంచ అథ్లెటిక్స్‌కు హిమదాస్, ద్యుతిచంద్