లింగ సమానత్వాన్ని దృష్టిలో ఉంచుకుని బీచ్ హ్యాండ్‌బాల్ మ్యాచ్‌లో అమ్మాయిలు(Olympic Beach Volleyball womens) బికినీలు మాత్రమే వేసుకుని పోటీపడాలనే నిబంధనను సమీక్షించాలని అంతర్జాతీయ హ్యాండ్ బాల్ సమాఖ్యను అయిదు దేశాలు కోరాయి. ఈ ఏడాది జులైలో బల్గేరియాలో జరిగిన యురోపియన్ బీచ్ హ్యాండ్‌బాల్ కాంస్య పతక పోరులో నార్వే అమ్మాయిలు బికినీలకు(Olympic Beach Volleyball womens uniforms) బదులు షార్ట్స్ వేసుకుని ఆడారు. బికినీలతోనే ఆడాలనే నిబంధనకు వ్యతిరేకంగా ఇలా చేశారు. దీంతో ఆ జట్టుపై యురోపియన్ హ్యాండ్‌బాల్ సమాఖ్య జరిమానా విధించడం(Olympic Beach Volleyball rules) వల్ల ఈ విషయం చర్భనీయాంశంగా మారింది.
పురుషులైతే టీషర్ట్, షార్ట్స్ వేసుకుని ఆడొచ్చు.. కానీ మహిళలు మాత్రం తప్పనిసరిగా బికినీలు మాత్రమే ఎందుకు వేసుకోవాలంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 'అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్యతో పాటు ఇతరసమాఖ్యలూ ఈ దుస్తుల నిబంధనపై సమీక్షించాలి. అథ్లెట్లు ఉత్తమ ప్రదర్శన చేసేందుకు, సౌకర్యంగా ఉండే వాటిని అనుమతించాలి' అని డెన్మార్క్ నార్వే, స్వీడెన్, ఐస్‌లాండ్, ఫిన్లాండ్ దేశాల క్రీడా మంత్రులు కలిసి బహిరంగ లేఖలో కోరారు. నార్వే అమ్మాయిల పట్ల గర్వంగా ఉందని తెలిపిన యుఎస్ పాప్ సింగర్ పింక్.. వాళ్లకు విధించిన జరిమానా (రూ. 1.26లక్షలు) చెల్లించేందుకు ముందుకు వచ్చింది.
ఇదీ చదవండి:ఐదుగురు ఒలింపిక్ స్టార్స్‌కు ప్రమోషన్లు