ETV Bharat / sports

ఒలింపిక్స్​ను ఊపేసే ఆ 'బోల్ట్​' వారసులు ఎవరు? - olympics Usain bolt record

ప్రతి ఒలింపిక్స్​లో(Tokyo olympics) తమ ప్రతిభ, ప్రదర్శన, విన్యాసాలతో యావత్​ ప్రపంచ దృష్టిని ఆకర్షించే ఓ స్టార్​ కనిపిస్తూనే ఉంటారు. దీంతో ఈ విశ్వక్రీడల సంబరం అంబరాన్ని తాకుతుంది. గత మూడు ఒలింపిక్స్​ల్లో ఆ స్థానంలో మహారాజులా ఉన్నాడు జమైకా స్టార్​ స్పింటర్​ ఉసేన్​ బోల్ట్​ (Olympics Usain Bolt)​. మరి ఈ సారి ఆ స్థానం ఎవరిదో?

olympics
ఒలింపిక్స్​
author img

By

Published : Jul 22, 2021, 7:35 AM IST

ఒలింపిక్స్‌.. ఎన్ని రోజులైనా జరగొచ్చు. ఎన్ని క్రీడాంశాల్లోనైనా పోటీలు ఉండొచ్చు. అగ్రశ్రేణి దేశాలు.. అథ్లెట్లు ఎన్ని స్వర్ణాలైనా కొల్లగొట్టొచ్చు. ఎన్నో రికార్డు బద్దలవ్వొచ్చు. మరెన్నో ప్రత్యేకతలు చూడొచ్చు. కాని ఒలింపిక్స్‌ మొత్తాన్ని ఊపేసే స్టార్‌ ఒకరుంటారు. తన ప్రతిభ, ప్రదర్శన, విన్యాసాలతో యావత్‌ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకునే స్టారాది స్టార్‌తో ఒలింపిక్స్‌ సంబరం అంబరాన్ని తాకుతుంది! గత మూడు ఒలింపిక్స్‌లలో ఆ స్థానంలో రారాజులా వెలుగొందాడు జమైకా పరుగు వీరుడు.. ఉసేన్‌ బోల్ట్‌(Olympics Usain Bolt)! రియో ఒలింపిక్స్‌ తర్వాత పరుగుకు బోల్ట్‌ వీడ్కోలు పలికిన నేపథ్యంలో అతని వారుసుడెవరు? ఎవరాస్టార్‌?

ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగు ఆయువు 10 సెకన్లలోపే! ఇలా మొదలై.. అలా ముగిసే 100 మీ పరుగు కోసం యావత్‌ ప్రపంచం నాలుగేళ్లు ఎదురు చూస్తుందనడంలో అతిశయోక్తి లేదు. సెకనులో వందో వంతు తేడాతో విజేతను నిర్ణయించే ఈ పరుగుకు.. మొత్తంగా ఒలింపిక్స్‌కు మరింత ఆకర్షణ తీసుకొచ్చిన ఘనత బోల్ట్‌దే(Usain Bolt Speed). 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో 100 మీ, 200 మీ.. 2012, 2016 ఒలింపిక్స్‌లో 100 మీ, 200 మీ, 4×100 మీ రిలేలలో బంగారు పతకాలతో బోల్ట్‌ హోరెత్తించాడు. బీజింగ్‌ ఒలింపిక్స్‌తో స్టార్‌గా మారిన బోల్ట్‌.. లండన్‌, రియోలలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఏ క్రీడలోనైనా ప్రపంచకప్‌ ఫైనల్‌ మాదిరిగా బోల్ట్‌(Usain Bolt Record) రాకతో 100 మీ. పరుగు ఒలింపిక్స్‌లో పతాక సన్నివేశంగా మారిపోయింది. మరి బోల్ట్‌ రిటైర్మెంట్‌తో ఆ స్థానం ఎవరికి దక్కుతుందో.. ఆ తార ఏ క్రీడ తారనో..!

కొలనులో కేక

స్విమ్మింగ్‌ అంటే గుర్తొచ్చే పేరు.. మైకేల్‌ ఫెల్ఫ్స్‌. ఒలింపిక్స్‌ చరిత్రలోనే అత్యధికంగా 23 స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక ఆటగాడు. అయితే అతని వారుసడిగా దూసుకొచ్చిన మరో అమెరికా స్విమ్మర్‌ కలేబ్‌ డ్రెస్సెల్‌ కొలనులో కేక పుట్టిస్తున్నాడు. 2017 బుడాపెస్ట్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 7 స్వర్ణాలు కొల్లగొట్టాడు. 2019 దక్షిణ కొరియా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 6 స్వర్ణాలు, 2 రజతాలతో ఒక ప్రధాన అంతర్జాతీయ స్విమ్మింగ్‌ టోర్నీలో 8 పతకాలు సాధించిన ఫెల్ఫ్స్‌ రికార్డును సమం చేశాడు. టోక్యోలో 50 మీ, 100 మీ ఫ్రీస్టైల్‌, 100 మీ బటర్‌ఫ్లై వ్యక్తిగత ఈవెంట్లతో పాటు టీమ్‌ విభాగాల్లో పోటీపడనున్న డ్రెస్సెల్‌.. ఫెల్ఫ్స్‌ రికార్డులపై గురిపెట్టాడు.

meckel
మైకేల్‌ ఫెల్ఫ్స్‌

కొత్త చిరుత

ఒలింపిక్స్‌లో 100 మీ పరుగుకు ఉండే ఆకర్షణే వేరు. స్ప్రింట్‌ను మరింత ఆకర్షణీయంగా.. ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన బోల్ట్‌కు టోక్యోలో వారసుడు ఎవరంటే ముందు వరుసలో ఉన్న పేరు బ్రొమెల్‌. తన వారసుడు కాగల అథ్లెట్‌ అని స్వయంగా బోల్టే చెప్పడం వల్ల ఇప్పుడు అందరి చూపు అతడిపైనే ఉంది. 2016 ఒలింపిక్స్‌లో పోటీపడి ఫైనల్‌ చేరిన ఈ అమెరికా అథ్లెట్‌ 100 మీటర్ల పరుగులో ఫేవరెట్లలో ఒకడు. 9.77 సెకన్లతో అత్యుత్తమ వ్యక్తిగత టైమింగ్‌ నమోదు చేసి అతడు టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యాడు. అంచనాలను అతడు ఏ మేరకు అందుకుంటాడో చూడాలి.

bromel
బ్రొమెల్‌

మెరుపు తీగ

సిమోన్‌ బైల్స్‌.. అమెరికా ఆర్టిస్టిక్‌ జిమ్నాస్ట్‌. రియో ఒలింపిక్స్‌లో 4 స్వర్ణాలు, ఒక రజతం కొల్లగొట్టిందీ నల్ల కలువ. ఇక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె సాధించిన స్వర్ణ పతకాల సంఖ్య అక్షరాల 19! రజతాలు, కాంస్యాలు.. మిగతా టోర్నీల్లో పతకాలకు లెక్కేలేదు. జిమ్నాస్టిక్స్‌లోనే అత్యుత్తమ క్రీడాకారిణిగా పేరుతెచ్చుకున్న 24 ఏళ్ల బైల్స్‌ టోక్యో ప్రదర్శనను ప్రపంచమంతా ఆసక్తిగా గమనించనుంది. పోటీ క్రీడాకారిణుల కంటే ఎంతో ముందున్న బైల్స్‌ బంగారు పతకాలు సాధించడం ఖాయమే అయినా ఆ మధుర క్షణాల కోసం క్రీడా లోకం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. కెరీర్‌లో ఇవే చివరి ఒలింపిక్స్‌ అంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో టోక్యోను బైల్స్‌ ఎలా చిరస్మరణీయం చేసుకుంటుందో చూడాలి!

simon
సిమోన్‌ బైల్స్‌

నయా బోల్ట్‌

టోక్యోలో 200 మీ పరుగులో విజేత ఎవరన్న చర్చ సాగుతున్న తరుణంలో బుల్లెట్‌లా దూసుకొస్తున్నాడు అమెరికా యువ స్ప్రింటర్‌ ఎరియోన్‌ నైటన్‌. 17 ఏళ్ల నైటన్‌ అచ్చం బోల్ట్‌ను తలపిస్తుండటం విశేషం. వేగం, రికార్డుల చరిత్ర, ఆకర్షణలో నైటన్‌ కూడా బోల్ట్‌ మాదిరే కనిపిస్తున్నాడు. అండర్‌-18, అండర్‌-20 విభాగాల్లో బోల్ట్‌ ప్రపంచ రికార్డులను బద్దలుకొట్టిన ఉత్సాహంలో ఒలింపిక్స్‌కు సిద్ధమైన నైటన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల జరిగిన ఒలింపిక్‌ ట్రయల్స్‌ హీట్స్‌లో 19.88 సెకన్ల టైమింగ్‌తో బోల్ట్‌ రికార్డును నైటన్‌ తిరగ రాశాడు. భవిష్యత్తు బోల్ట్‌ ఇతడే అన్న అంచనాలు భారీగా ఉన్నాయి.

bolt
ఎరియోన్​ నైటన్​

ఇదీ చూడండి: బికినీ వేసుకోనందుకు రూ.1.31 లక్షల జరిమానా​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.