ETV Bharat / sports

'లెజెండ్​ ఆఫ్​ చెస్' నుంచి​ ఆనంద్ నిష్క్రమణ​ - విశ్వనాథన్​ ఆనంద్​ లేటెస్ట్​ న్యూస్​

భారత గ్రాండ్​మాస్టర్​ విశ్వనాథన్​ ఆనంద్​.. 'లెజెండ్ ఆఫ్ చెస్' టోర్నీని ఓటములతో ముగించాడు. కేవలం ఏడు పాయింట్లే సాధించి, తొమ్మిదో స్థానానికి పరిమితమయ్యాడు​.

Viswanathan Anand ends disastrous Legends of Chess campaign with 8 defeats
లెజెండ్​ ఆఫ్​ చెస్ నుంచి విశ్వనాథన్​ ఆనంద్ నిష్క్రమణ​
author img

By

Published : Jul 30, 2020, 5:04 PM IST

Updated : Jul 30, 2020, 5:13 PM IST

'లెజెండ్​ ఆఫ్​ చెస్​' ఆన్​లైన్​ టోర్నీలో వరుసగా ఎనిమిది మ్యాచ్​ల్లోనూ ఓడిపోయాడు ప్రముఖ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. తద్వారా పోటీ నుంచి నిష్క్రమించాడు. బుధవారం జరిగిన చివరి రౌండ్​లో ఉక్రెయిన్​కు చెందిన వాసిల్​ ఇవాన్​చుక్​పై ఓటమిపాలై, తొమ్మిదో స్థానానికి పరిమితమయ్యాడు.

టోర్నీ ప్రారంభంలోనే తొమ్మిది మ్యాచ్​లు గెలిచిన ప్రపంచ నెం.1 మాగ్నస్​ కార్ల్​సెన్..​ వ్లాదిమిర్​ క్రామ్నిక్​ను 3-1 తేడాతో ఓడించి 'ఆల్​-విన్'​ రికార్డుతో ముగించాడు. ​ సెమీస్​లోని ఓ మ్యాచ్​లో నార్వేజియన్, రష్యాకు చెందిన పీటర్​ స్విడ్లర్​ ఆడనుండగా.. మరో మ్యాచ్​లో అనీష్​ గిరి(హంగేరీ) ఇయాన్​ నెపోమ్నియాచ్ట్చి (రష్యా) తలపడనున్నారు. లెజెండ్స్​ ఆఫ్​ చెస్​ టోర్నీలో చెస్సబుల్​ మాస్టర్స్​లో సెమీఫైనలిస్టులైన కార్ల్​సన్​, లిరెన్​, నెపోమ్నియాచ్ట్చి, గిరి ప్రత్యక్షంగా ఇందులో ఆహ్వానాన్ని అందుకున్నారు. వీరందరూ వారి చెస్​ కెరీర్​లోని ఏదో సమయం​లో ప్రపంచ చెస్​ ఛాంపియన్​గా నిలిచినవారే. లెజెండ్​ ఆఫ్​ చెస్​ టోర్నీ.. మాగ్నస్​ కార్ల్​సెన్​ చెస్​ టూర్​లో భాగం. దీని విజేత ఆగస్టు 9 నుంచి 20 వరకు జరగనున్న గ్రాండ్​ ఫైనల్​కు అర్హత సాధిస్తాడు.

తుది స్టాండింగ్​లు:

1) కార్ల్​సెన్​ (25 మ్యాచ్​ పాయింట్లు)

2) నెపోమ్నియాచ్ట్చి (20 పాయింట్లు)

3) అనీష్​ గిరి (18 పాయింట్లు)

4) స్విడ్లర్​ (14 పాయింట్లు)

5) ఇవాన్​ చుక్​ (13 పాయింట్లు)

6) క్రామ్నిక్​ (12 పాయింట్లు)

7) గెల్ఫాండ్​ (11 పాయింట్లు)

8) లిరెన్​ (7 పాయింట్లు)

9) విశ్వనాథన్​ ఆనంద్​ (7 పాయింట్లు)

10) లెకో (6 పాయింట్లు)

Last Updated : Jul 30, 2020, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.