కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి నిధులు సమకూర్చేందుకు ఆరుగురు భారత చెస్ క్రీడాకారులు ముందుకొచ్చారు. వారిలో మాజీ ప్రపంచ విజేత విశ్వనాథన్ ఆనంద్ ఉన్నాడు. ఆన్లైన్లో ఈనెల 11వ తేదీన చెస్ ఆడటం ద్వారా వచ్చిన మొత్తాన్ని 'పీఎం కేర్స్'కు అందిచనున్నారు.
ఈ పోటీల్లో ఆనంద్‌తో పాటు తెలుగు గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, హరికృష్ణతో పాటు ఆనంద్, అధిబన్, విదిత్ గుజరాతి భాగమవుతారు. chess.com ద్వారా ఈ గేమ్ నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా భారత్ ప్లేయర్లతో ఆడాలనుకునేవారు 25 డాలర్లు చెల్లించి పేరు నమోదు చేసుకోవచ్చు. అదే ఆనంద్‌తో పోటీ పడాలంటే 150 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కరోనా వల్ల ప్రస్తుతం జర్మనీలో చిక్కుకుపోయాడు ఆనంద్.
భారత్‌కు చెందిన 49 మంది క్రీడాకారులతో గతవారం, ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్లేయర్లకు విజ్ఞప్తి చేశారు.