భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఇటీవలే చేసిన కరోనా పరీక్షల్లో నెగటివ్‌గా తేలింది. గత నెల 28న కరోనా బారిన పడిన వినేశ్‌కు మంగళవారం జరిపిన టెస్టుల్లో వైరస్ లేదని నిర్ధరణ అయినట్లు ట్వీట్ చేసింది.
-
I underwent a second COVID-19 test yesterday and am happy to report that I have received a negative result. While this is great news, I will be remaining in isolation as a precautionary measure. A big thank you to everyone for your prayers 😊🙏
— Vinesh Phogat (@Phogat_Vinesh) September 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I underwent a second COVID-19 test yesterday and am happy to report that I have received a negative result. While this is great news, I will be remaining in isolation as a precautionary measure. A big thank you to everyone for your prayers 😊🙏
— Vinesh Phogat (@Phogat_Vinesh) September 1, 2020I underwent a second COVID-19 test yesterday and am happy to report that I have received a negative result. While this is great news, I will be remaining in isolation as a precautionary measure. A big thank you to everyone for your prayers 😊🙏
— Vinesh Phogat (@Phogat_Vinesh) September 1, 2020
"మంగళవారం రెండోసారి కరోనా పరీక్ష చేయించుకున్నప్పుడు నెగటివ్‌గా తేలింది. ఈ పరిస్థితిలోనూ ఐసోలోషన్‌లో ఉంటూ జాగ్రత్త చర్యలు పాటిస్తాను. నేను కోలుకోవాలని ప్రార్థనలు చేసిన వారికి ధన్యవాదాలు"
- వినేశ్ ఫొగాట్, భారత మహిళా రెజ్లర్
స్వస్థలం సోనీపత్‌లో కోచ్ ఓం ప్రకాశ్ ఆధ్వర్యంలో టోక్యో ఒలింపిక్స్ కోసం వినేశ్ శిక్షణ తీసుకుంటోంది. ఈ సమయంలో కరోనా వచ్చినట్లు తేలింది. గతంలో ఈమె ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది.
గతనెల 28వ తేదీన వినేశ్ ఫొగాట్‌కు కరోనా వైరస్ సోకినట్లు ప్రకటించింది. జాతీయ క్రీడా పురస్కారం ఖేల్‌రత్నకు ఎంపికైన ఈమె.. వైరస్ సోకిన కారణంగా అవార్డుల ప్రదానోత్సవానికి దూరంగా ఉంది. ఈ వేడుకను వర్చువల్‌గా నిర్వహించి గ్రహీతలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారాలను అందించారు.