ETV Bharat / sports

ఈనెల 19న లాప్సన్​తో భారత బాక్సర్​ విజేందర్ ఢీ

author img

By

Published : Mar 13, 2021, 6:41 AM IST

దాదాపు ఏడాది అనంతరం బాక్సింగ్ రింగ్​లోకి అడుగుపెడుతున్నాడు భారత స్టార్​ విజేందర్​ సింగ్. ఈనెల 19న జరిగే ఈ గేమ్​లో రష్యా బాక్సర్​ ఆర్టిష్​ లాప్సన్​తో తలపడనున్నాడు.

Vijender to face Russia's Artysh Lopsan in comeback fight
ఈనెల 19న లాప్సన్​తో భారత బాక్సర్​ విజేందర్ ఢీ

ప్రొఫెషనల్​ బాక్సింగ్​లో దూసుకెళ్తున్న భారత స్టార్​ విజేందర్ సింగ్​ మరో పోరుకు సిద్ధమయ్యాడు. ఏడాదికి పైగా విరామం తర్వాత అతడు ఈనెల 19న జరిగే బౌట్లో రష్యా బాక్సర్​ ఆర్టిష్​ లాప్సన్​తో తలపడబోతున్నాడు. ఈ బౌట్​కు మరో ప్రత్యేకత ఉంది. ఈసారి పోరు జరగబోయేది నేల మీద కాదు ఓడపై! పనాజిలోని మెజిస్టిక్ ప్రైడ్​ కాసినో ఓడ పైభాగంలో ఈ పోటీకి రంగం సిద్ధమైంది.

విజేందర్ ప్రత్యర్థి లాప్సన్​కు కూడా మంచి రికార్డే ఉంది. ఆరు బౌట్లు ఆడిన అతడు నాలుగింట్లో గెలిచాడు. అందులో రెండు నాకౌట్​ విజయాలు ఉన్నాయి. అయితే విజేందర్​ మాత్రం ప్రత్యర్థి కన్నా మెరుగ్గా ఉన్నాడు. ఇప్పటిదాకా 12 బౌట్లు ఆడిన అతడు.. ఒక్కసారీ ఓడలేదు. ఎనిమిది పర్యాయాలు ప్రత్యర్థులను నాకౌట్​ చేశాడు.

ఇదీ చదవండి: 'సచిన్​తో మాట్లాడాక నా బ్యాటింగ్​లో మార్పొచ్చింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.