ETV Bharat / spiritual

మొండి బాకీలు ఎంతకీ వసూలు కావడం లేదా? - గురువారం ఈ పనులు చేయండి - వాళ్లే తెచ్చి ఇస్తారట! - Debts Recovery Tips as Per Vastu - DEBTS RECOVERY TIPS AS PER VASTU

Debts Recovery Tips: మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చారా? వాటిని తిరిగి తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ధనం తిరిగి చేతికి రావడం లేదా? అయితే పరిహార శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేస్తే మొండి బకాయిలు తొందరగా వసూలు అవుతాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​కుమార్​ చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Debts Recovery Tips
Debts Recovery Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2024, 10:03 AM IST

Debts Recovery Tips as Per Astrology: చాలా మంది తమ అవసరాల కోసం ఇతరుల దగ్గర డబ్బులు అప్పుగా తీసుకుంటుంటారు. కానీ.. తిరిగి ఇవ్వడానికి ఎంతో ఆలస్యం చేస్తుంటారు. ఇచ్చిన వారు ఎన్నిసార్లు అడిగినా అప్పుడు ఇస్తా.. ఇప్పుడు ఇస్తా అంటూ కాలం వెల్లదీస్తారు. దీంతో.. ఆ మొండి బకాయిలు వసూలు చేయడం చాలా కష్టమవుతుంది. అయితే.. మొండి బకాయిలు తొందరగా వసూలు కావాలంటే పరిహార శాస్త్రంలో సూచించిన కొన్ని పనులు చేయాలని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు మాచిరాజు కిరణ్​ కుమార్​. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • గురువారం రోజు సూర్యాస్తమయానికి గంట ముందు రావి, మర్రి, వేప చెట్లలో ఏదో ఒక వృక్షం దగ్గర చీమలు ఎక్కువగా సంచరించే ప్రదేశంలో ఒక కిలో చక్కెర పోయాలి. ఇలా మూడు గురువారాలు చేస్తే మొండి బాకీల సమస్య నుంచి బయటపడతారని, రావాల్సిన డబ్బు చేతికొస్తుందని మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు.
  • జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసినా మొండి బకాయిల సమస్యలు తొలగిపోతాయి. 41 రోజుల పాటు ప్రతిరోజూ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి 12 ప్రదక్షిణలు చేస్తే మంచి జరుగుతుందని అంటున్నారు.
  • గురువారం రోజున దగ్గరలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి రకరకాల పూలు కలిసిన పూల దండలను స్వామి వారికి అలకరించి పూజ చేయించుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుందట. ఇలా మూడు గురువారాలు చేయమని సలహా ఇస్తున్నారు.
  • ప్రతి ఆదివారం గుమ్మం ముందు దీపం పెట్టినా మొండి బకాయిల సమస్య తీరుతుందట. ఆదివారం సాయంత్రం గుమ్మం ముందు ఆవునెయ్యి, ఆముదం కలిపి దీపాలు వెలిగిస్తే మంచిదంటున్నారు.

'బీరువా లోపల ఈ వస్తువులు ఉండాలి - తప్పక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది'

  • మొండి బాకీలు వసూలు కావాలంటే దేవాలయ ప్రాంగణంలో దానిమ్మ మొక్క నాటి నీళ్లు పోస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని.. రావాల్సిన డబ్బులు చేతికొస్తాయని చెబుతున్నారు.
  • శివాలయంలో కాలభైరవుడిని దర్శించుకున్న మంచి జరుగుతుందని అంటున్నారు. అన్నం, పెసర్లతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి.. దానిని దేవాలయంలో భక్తులకు పంచి పెడితే డబ్బులు వస్తాయని సూచిస్తున్నారు.
  • మంగళవారం రోజు కుబేర ముగ్గు వేస్తే మొండి బాకీలు వసూలు అవుతాయని అంటున్నారు. అందుకోసం పూజ గదిలో పీట వేసి దాని మీద బియ్యప్పిండితో ముందుగా పెద్ద చతురస్త్రాకారాన్ని గీయాలి. ఆ తర్వాత స్వ్కేర్​ బాక్స్​లో మళ్లీ తొమ్మిది చతురస్త్రాకారాలు వచ్చేలా గీసి అందులో నెంబర్లు రాయాలి. ఆ సంఖ్యలు రాసిన తర్వాత ఒక్కొక్క నెంబర్​ మీద ఒక్కో రూపాయి కాయిన్​ పెట్టాలి. అలాగే ఎరుపు రంగు పుష్పాన్ని ఒక్కో నెంబర్​ మీద ఉంచాలి. ఆ తర్వాత అగరబత్తీలు వెలిగించాలి. ఇలా నాలుగు మంగళవారాలు చేస్తే మీరు అడగకముందే వాళ్లే వచ్చి డబ్బులు ఇస్తారని అంటున్నారు. ఆ నెంబర్లు ఇవే..
272025
222426
232821
  • శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్లి పెరుగులో మినుములు వేసి ఆ పెరుగును రావి చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఎవరైతే శనివారం ఇలా చేస్తారో వాళ్లకు రావాల్సిన డబ్బులు చేతికి వస్తాయని అంటున్నారు.

'ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయా? - శుక్రవారం రోజున ఇలా చేస్తే కష్టాలు తీరిపోతాయి'

"మంచం మీద వేసే దుప్పట్లపై ఈ గుర్తులు ఉంటే - అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది"!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.