ETV Bharat / sports

Tokyo Olympics: క్రీడా గ్రామంలో ఇద్దరు అథ్లెట్లకు కరోనా

టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)​ కోసం ఏర్పాటు చేసిన క్రీడా గ్రామంలో ఇద్దరు క్రీడాకారులకు కరోనా సోకింది. వీరితో పాటు ఒలింపిక్స్​లో పాల్గొనేందుకు వచ్చిన మరో క్రీడాకారుడికీ కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం ఆ అథ్లెట్​ హోటల్​లో​ నిర్బంధంలో ఉన్నాడు. అథ్లెట్లకు చేస్తున్న స్క్రీనింగ్​ పరీక్షల్లో శనివారం తొలి కేసు బయటపడగా.. ఆదివారం మరో రెండు కేసులు నమోదైనట్లు ఒలింపిక్​ నిర్వాహక కమిటీ వెల్లడించింది.

Two athletes test positive for Covid-19 in Olympic Village, say officials: AFP News Agency
Tokyo Olympics: క్రీడా గ్రామంలో ఇద్దరు అథ్లెట్లకు కరోనా
author img

By

Published : Jul 18, 2021, 8:55 AM IST

Updated : Jul 18, 2021, 10:23 AM IST

మరో ఐదు రోజుల్లో ఒలింపిక్స్‌(Tokyo Olympics) క్రీడా సంబరం మొదలవనున్న వేళ.. కరోనా వైరస్‌ కలకలం రేపింది. ఒలింపిక్స్‌ క్రీడా గ్రామంలో ఆదివారం రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు శనివారం ఓ అథ్లెట్​కు కరోనా సోకగా.. అ​తడు ఉంటున్న హోటల్​లోనే ఐసోలేషన్​లో గడుపుతున్నాడు. అథ్లెట్లకు నిర్వహించిన స్క్రీనింగ్​ పరీక్షల్లో ఇప్పటివరకు ముగ్గురు ఆటగాళ్లకు కరోనా సోకినట్లు ఒలింపిక్​ నిర్వాహక కమిటీ వెల్లడించింది.

ఒలింపిక్స్​లో పాల్గొనేందుకు జులై 1 తేదీ నుంచి 16 మధ్య విదేశాల నుంచి ఇప్పటివరకు దాదాపుగా 15 వేల మంది క్రీడాకారులు, అధికారులు, మీడియా ప్రతినిధులు వచ్చారు. అయితే వారందరికీ నిర్వహించిన కరోనా పరీక్షల్లో కేవలం 15 మందే వైరస్​ బారిన పడినట్లు తెలుస్తోంది.

కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన ఒలింపిక్స్‌ ఈ నెల 23 నుంచి టోక్యోలో ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 13న ఈ క్రీడా గ్రామాన్ని తెరిచారు. ఇప్పటికే వేలాది మంది అథ్లెట్లు, అధికారులు ఈ గ్రామానికి చేరుకున్నారు. కరోనా దృష్ట్యా కఠిన నిబంధనల నడుమ ఒలింపిక్స్‌ను నిర్వహించనున్నారు. ఈ విశ్వక్రీడలకు దాదాపుగా 11వేల మంది, పారాలింపిక్స్‌కు 4,400 మంది క్రీడాకారులు రానున్నారు. పారాలింపిక్స్‌ ఆగస్టు 24 నుంచి మొదలవుతాయి. క్రీడాగ్రామంలోకి వస్తున్న అథ్లెట్లలో 80% మందికి వ్యాక్సినేషన్‌ జరిగిందని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తెలిపింది.

ఇదీ చూడండి.. ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా కలకలం

Last Updated : Jul 18, 2021, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.