ETV Bharat / sports

శిక్షణలో అథ్లెట్లకు బ్యాటరీ ఆధారిత మాస్కులు - ఇండియన్​ ఒలింపిక్ కమిటీ వార్తలు

కరోనా వ్యాపిస్తున్న పరిస్థితుల్లో బ్యాటరీ ఆధారిత మాస్కులతో క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాలని భారత ఒలింపిక్​ సంఘం (ఐఓఏ) నిర్ణయించింది. ఈ మాస్క్​ రూపకర్త ఐఐటీ ఖరగ్​పూర్​ పూర్వ విద్యార్థి పియూష్​ అగర్వాల్​తో ఐఓఏ ఒప్పందం కుదుర్చుకుంది.

Trial of battery-operated masks to ensure intense training for athletes underway
శిక్షణలో అథ్లెట్లకు బ్యాటరీ ఆధారిత మాస్కులు
author img

By

Published : Sep 30, 2020, 7:26 AM IST

కరోనా మహమ్మారి తీవ్రత నేపథ్యంలో బ్యాటరీ ఆధారిత మాస్కుల సహాయంతో క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాలని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) నిర్ణయించింది. ఈమేరకు బ్యాటరీ ఆధారిత మాస్క్‌ రూపకర్త, ఐఐటీ ఖరగ్‌పూర్‌ పూర్వ విద్యార్థి పియూష్‌ అగర్వాల్‌తో ఐఓఏ ఒప్పందం కుదుర్చుకుంది. శిక్షణ సమయంలో అవసరమైన ఆక్సిజన్‌ను అందించడంలో ఈ బ్యాటరీ మాస్క్‌ సహాయ పడుతుంది.

ఒక్కో మాస్క్‌ ధర రూ.2200 అని ఐఓఏ కార్యదర్శి రాజీవ్‌ మెహతా తెలిపాడు. ఒలింపిక్స్‌లో బరిలో దిగే కొంతమంది క్రీడాకారులతో ప్రయోగాత్మకంగా వీటిని ఉపయోగిస్తామని చెప్పాడు. మంచి ఫలితాలు వస్తే తొలి దశగా వెయ్యి కొంటామని తెలిపాడు. "ప్రాక్టీస్‌ సమయంలో క్రీడాకారులకు సౌకర్యంగా అనిపిస్తే తొలి దశలో 1000 మాస్కులు తీసుకుంటాం. 10 నుంచి 15 మంది అథ్లెట్లకు అందజేస్తాం" అని మెహతా చెప్పాడు. ఈ ప్రయోగం విజయవంతమైతే మిగతా దేశాలకు సిఫార్సు చేస్తామని పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.