ETV Bharat / sports

ఒలింపిక్స్ టార్చ్​ రిలేలో తొలి కరోనా కేసు​ - tokyo olympics torch relay

టోక్యో ఒలింపిక్స్​ టార్చ్​ రిలేలో విధులు నిర్వహించిన ఓ పోలీస్​ అధికారికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ రిలేలో ఇదే తొలి వైరస్​ కేసు. ఈ విషయాన్ని ఒలింపిక్స్​ నిర్వాహకులు తెలిపారు.

Tokyo Olympics torch relay
ఒలింపిక్స్ టార్చ్​ రిలే
author img

By

Published : Apr 22, 2021, 1:45 PM IST

టోక్యో ఒలింపిక్స్​ టార్చ్​ రిలేకు సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొన్న ఓ పోలీస్​ అధికారికి కరోనా సోకింది. ఈ రిలేలో నమోదైన తొలి వైరస్​ కేసు ఇదే. ఈ విషయాన్ని ఒలింపిక్స్​ నిర్వాహకులు తెలిపారు.

ఒలింపిక్​ క్రీడల ప్రారంభానికి ముందు జ్యోతిని తరలించడం(టార్చ్​ రిలే) సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. దాదాపు 10 వేలమంది రన్నర్లతో జపాన్​లోని 47 ముఖ్యమైన ప్రాంతాల మీదుగా వెళ్తూ.. ఒలింపిక్స్​ జరగనున్న ప్రాంతానికి జులై 23న చేరుకుంటారు. ఇప్పటికే మార్చి 25న ఈశాన్య​ ఫుకుషిమా ప్రిఫెక్చర్​ వద్ద ప్రారంభమై అక్కడి నుంచి బయలుదేరింది. ఇందులో భాగంగా ఏప్రిల్​ 17న నైరుతి కగావా ప్రిఫెక్టర్​ వద్ద ఉండగా అక్కడి ట్రాఫిక్​ కంట్రోల్​ చేసే విధుల్లో ఓ 30ఏళ్ల పోలీస్​ అధికారి పాల్గొన్నాడు. ఆ తర్వాత రోజు నుంచే అతడిలో కొవిడ్ లక్షణాలు కనపడ్డాయి. పరీక్ష చేయించగా పాజిటివ్​గా తేలింది. ఆ అధికారి మాస్క్​ ధరించడం, సామాజిక దూరం వంటి జాగ్రత్త చర్యలు పాటించినప్పటికీ కరోనా సోకిందని అధికారులు తెలిపారు.

ఒలింపిక్స్​పై రోజుకో మాట

కరోనా మహమ్మారి పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై రోజుకో మాట వినిపిస్తోంది. కొంతమంది అధికారులు జరుగుతాయని చెప్తుండగా.. మరికొందర రద్దు అవుతాయని అంటున్నారు. అయితే ఆ మెగా క్రీడలను రద్దు చేసే అవకాశమే లేదని నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమోటో ఇటీవల తేల్చి చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.