ETV Bharat / sports

ఒలింపిక్ జ్యోతి వెలిగింది.. రిలే షురూ - ఒలింపిక్స్ లేటేస్ట్ న్యూస్

టోక్యో ఒలింపిక్స్​ జ్యోతి వెలిగింది.121 రోజుల పాటు సాగే టార్చ్ రిలే క్యార్యక్రమం ఫకుషిమాలో గురువారం ప్రారంభమైంది.

Tokyo Olympics: Torch relay begins its 121-days journey across Japan
ఒలింపిక్ జ్యోతి వెలిగింది.. టార్చ్ రిలే షురూ
author img

By

Published : Mar 26, 2021, 6:53 AM IST

జ్యోతి వెలగడం.. ఒలింపిక్స్‌ మహా సంబర ఆరంభానికి గుర్తిది! జులై 23న టోక్యోలో మొదలయ్యే ఈ ప్రపంచ క్రీడా వేడుకను ప్రతిబింబిస్తూ జ్యోతి వెలిగింది.. గురువారమే టార్చ్‌ రిలే కార్యక్రమం మొదలైంది. 121 రోజుల పాటు సాగే ఈ రిలే.. ఒలింపిక్స్‌ ఆరంభోత్సవ కార్యక్రమం వద్ద ముగుస్తుంది. జపాన్‌లోని ఫకుషిమా ప్రాంతం నుంచి ఈ రిలే ఆరంభమైంది.

2011లో సునామీ కారణంగా ఫకుషిమా తీవ్రంగా నష్టపోయింది. సుమారు 18 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2011 ఫిఫా ప్రపంచకప్‌ గెలిచిన ఫుట్‌బాల్‌ మహిళల జట్టులో కీలక సభ్యురాలు అజుసా.. ఇండోర్‌ సాకర్‌ శిక్షణ కేంద్రం నుంచి ఈ జ్యోతిని తీసుకురాగా.. మిగిలిన 14 మంది సభ్యులు, కోచ్‌ నోరియో ఆమెతో కలిసి ముందుకు సాగారు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అభిమానులను అనుమతించలేదు.

Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్ 2021

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.