ETV Bharat / sports

Olympics: ఒలింపిక్స్​తో భారత అథ్లెట్ల తొలి బ్యాచ్​ - tokyo olympics indian athlets

ఒలింపిక్స్​ కోసం భారత అథ్లెట్ల తొలి బృందం.. జులై 17న టోక్యోకు బయలుదేరనుంది. ఈ మెగాక్రీడల్లో పాల్గొనే అథ్లెట్స్​ పూర్తి వివరాల జాబితాను జులై 5న(సోమవారం) ప్రకటిస్తామని ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు.

olympics
ఒలింపిక్స్​
author img

By

Published : Jul 4, 2021, 3:45 PM IST

ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్​లో సత్తా చాటేందుకు భారత అథ్లెట్స్ సంసిద్ధమయ్యారు. ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మెగాక్రీడల్లో పాల్గొననున్న అథ్లెట్స్​లో మొదటి బ్యాచ్​ను జులై17న టోక్యోకు పంపించనున్నట్లు ఐఓఏ అధ్యక్షుడు నరీందర్​ బాత్రా వెల్లడించారు.

"మా ప్రణాళిక ప్రకారం తొలి బ్యాచ్​ అథ్లెట్స్​ను జులై 17న టోక్యోకు పంపించనున్నాం. వీలైతే క్వారంటైన్​ నిబంధనలు , ట్రైనింగ్​ దృష్ట్యా రెండు రోజుల ముందే వారిని పంపించడానికి ప్రయత్నిస్తాం. దీనిపై సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నాం. ఆటగాళ్లకు అన్ని విధాలా సహకరిస్తూ, బాగా ప్రోత్సాహిస్తున్నాం. త్వరలోనే పరిస్థితులన్నీ సద్దుమణుగుతాయని ఆశిస్తున్నాను"

-బాత్రా, ఐఓఏ అధ్యక్షుడు

ఒలింపిక్స్​కు భారత తరఫున ప్రాతినిధ్యం వహించే అథ్లెట్స్​ పూర్తి వివరాల జాబితాను జూన్​5(సోమవారం) ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు బాత్రా. మొత్తంగా 115 మంది అథ్లెట్స్​ భారత తరఫున ఈ మెగాక్రీడల బరిలో ఉన్నారు.

ఇదీ చూడండి: Olympics: భారత అథ్లెట్లకు జపాన్ కఠిన ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.