ETV Bharat / sports

Olympics 2021: విశ్వక్రీడలకు వేళాయెరా- విశేషాలివే.. - టోక్యో ఒలింపిక్స్​ ప్రారంభోత్సవ వేడుక

అట్టహాసంగా జరగాల్సిన ఒలింపిక్స్ పోటీలు.. ఈసారి వీక్షకులు లేకుండానే నిరాడంబరంగా జరగనున్నాయి. 2020లోనే జరగాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. శుక్రవారం జరిగే ప్రారంభోత్సవంతో.. విశ్వక్రీడలకు తెరలేవనుంది. ఆ వేడుకకు పరిమిత సంఖ్యలోనే అథ్లెట్లు, అధికారులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా విశ్వక్రీడల గురించి కొన్ని విశేషాలు మీకోసం..

olympics
ఒలింపిక్స్​
author img

By

Published : Jul 22, 2021, 3:30 PM IST

Updated : Jul 22, 2021, 4:37 PM IST

వివిధ దేశాధినేతలు, ఆయా దేశాల జాతీయ పతకాల రెపరెపలు, నృత్య ప్రదర్శనలు.. ఇలా అట్టహాసంగా జరగాల్సిన ఒలింపిక్స్​ గతేడాది కరోనా కారణంగా 2021కి వాయిదా పడింది. మొత్తంగా ఎన్నో సవాళ్లను అధిగమించి ఎట్టకేలకు జులై 23(శుక్రవారం) సాయంత్రం ప్రారంభోత్సవ వేడుకతో.. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎదురుచూస్తున్న టోక్యో ఒలింపిక్స్​కు తెరలేవనుంది. ఎప్పుడూ ఎంతో ఘనంగా జరిగే ఒలింపిక్స్​ ఈ సారి కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మెగాఈవెంట్​ గురించి కొన్ని విశేషాలు మీ కోసం..

  • విశ్వక్రీడల చరిత్రలో టోక్యో ఒలింపిక్స్​ 32వది.
  • జపాన్​ రాజధాని టోక్యో జాతీయ స్టేడియంలో శుక్రవారం జరిగే ప్రారంభోత్సవంతో ఒలింపిక్స్​కు తెరలేవనుంది.
  • కరోనా నేపథ్యంలో ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మేక్రాన్​, మంగోలియన్​ ప్రధాని ఓయున్-ఎర్డెనే, అమెరికా ప్రథమ మహిళ జిల్​ బైడెన్​తో పాటు మరికొంత మంది విశ్వక్రీడల ఆరంభ వేడుకకు వస్తామని ఇదివరకే ప్రకటించారు.
  • భారత తరఫున పతాకధారులుగా పురుషుల హాకీ జట్టు సారథి మన్​ప్రీత్​ సింగ్​, బాక్సర్​ మేరీకోమ్​ ఉన్నారు.
  • మొత్తంగా ఈ సారి ఒలింపిక్స్​లో దాదాపుగా 206 దేశాల నుంచి సుమారుగా 11 వేల అథ్లెట్లు పాల్గొంటున్నారు.
  • 33 క్రీడల కోసం 339 బంగారు పతకాలను నిర్వాహకులు సిద్ధం చేశారు.
  • ఈ మెగా ఈవెంట్​లో భారత్​ తరఫున 127 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు.
  • టోక్యో ఒలింపిక్స్​ను భారతదేశంలో సోనీ టెన్​ 1, సోనీ టెన్​ 2లో ఇంగ్లీష్​ వ్యాఖ్యానం.. సోనీ టెన్​ 3లో హిందీ వ్యాఖ్యానంతో ప్రసారం చేయనున్నారు. జియో టీవీలో ప్రత్యక్షప్రసారంగా చూడొచ్చు.
  • ఇప్పటికే రెండురోజుల ముందు నుంచే ఈ మెగాఈవెంట్​కు సంబంధించిన సాఫ్ట్ బాల్, ఫుట్​బాల్​ టోర్నీలు ప్రారంభమైపోయాయి.
  • ఈ ఒలింపిక్స్ కోసం..​ చరిత్రలోనే తొలిసారి రీసైక్లింగ్ చేసిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పతకాలు తయారుచేశారు. మెడల్స్​ కోసం దాదాపు 62 లక్షల మొబైల్​ ఫోన్లను రీసైక్లింగ్​ చేశారు. 32 కిలోల బంగారం కూడా స్వర్ణ పతకాల కోసం ఉపయోగించారు.
  • టోక్యో ఒలింపిక్స్​లో ఇచ్చే గోల్డ్ మెడల్ బరువు 556 గ్రాములు. రజతం 550 గ్రాములు, కాంస్యం 450 గ్రాములు ఉండనుంది.
  • 2024 ఒలింపిక్స్​ పారిస్​(ఫ్రాన్స్​)లో జరగనున్నాయి. 2028 ఒలింపిక్స్​- లాస్​ ఏంజెలెస్​ (అమెరికా), 2032 ఒలింపిక్స్​- బ్రిస్బేన్​ (ఆస్ట్రేలియా) వేదికగా జరగనున్నాయి.

ఇదీ చూడండి: 'ఒలింపిక్​ ఛాంపియన్'​గా నల్లజాతీయుడు.. అదే తొలిసారి!

Olympics: పతకాన్ని ఎందుకు కొరుకుతారో తెలుసా?

ఒలింపిక్​ క్రీడలను ఎప్పుడు, ఎలా చూడొచ్చు!

Last Updated : Jul 22, 2021, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.