భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్(Dutee Chand) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒలింపిక్స్ అర్హత టోర్నీలో భాగంగా పాటియాలా వేదికగా జరుగుతోన్న జాతీయ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో 11.17 సెకండ్లలోనే 100మీ. పరుగును పూర్తి చేసింది. గతంలో ఆమె పేరిటే ఉన్న రికార్డును తాజాగా అధిగమించింది ద్యుతీ. 11.15 సెకన్లలో పరుగును పూర్తి చేస్తే టోక్యోకు అర్హత సాధించేది ఈ స్ప్రింటర్. కానీ, కొద్ది తేడాతో ఈ అవకాశాన్ని కోల్పోయింది.
భారత షాట్‌పుట్ ఆటగాడు తజిందర్ పాల్ సింగ్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. ఈ క్రమంలో అతడి సొంత రికార్డును బద్దలుకొట్టాడు. మొదటి సారి 21.49 మీ. దూరం విసిరిన అతడు.. రెండో పర్యాయంలో 21.28 మీ. దూరానికి విసిరాడు. భారత డిస్కస్ త్రో ప్లేయర్ కమల్‌ప్రీత్ కౌర్.. తన జాతీయ రికార్డును మెరుగుపరుచుకుంది. గతంలో 65.06 మీ. దూరం డిస్కస్ విసిరిన కౌర్.. తాజాగా 65.59 మీ. దూరం విసిరింది.
ఇదీ చదవండి: వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రపంచకప్‌కు అనుమతి