ETV Bharat / sports

రెండో టీ20.. ఇంగ్లాండ్​తో అమీతుమి.. సిరీస్​పై కన్నేసిన భారత్​ - Indian team preview

ఇంగ్లాండ్​తో మూడు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా.. రెండో మ్యాచ్‌కు సన్నద్ధమైంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న రెండో టీ20లో గెలిచి.. సిరీస్​ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సిరీస్​ గెలుచుకొని.. టెస్టులో జరిగిన పరాజయానికి టీమ్​ ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?

Team India is looking to win the second T20 and clinch the series

author img

By

Published : Jul 8, 2022, 7:23 PM IST

ఇంగ్లండ్‌తో 3 టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా.. సిరీస్‌పై కన్నేసింది. బర్మింగ్‌హామ్‌ వేదికగా శనివారం జరిగే రెండోమ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఒడిసిపట్టాలని భావిస్తోంది. మెుదటి మ్యాచ్‌కు దూరమైన విరాట్‌ కోహ్లీ.. 5 నెలల తర్వాత టీ20లు ఆడనున్నాడు. సీనియర్లకు విశ్రాంతి, రొటేషన్‌ విధానం అమలు చేయడంతో పలువురు కొత్త ఆటగాళ్లకు జట్టులో చోటు లభించింది. దీంతో తొలి మ్యాచ్‌లో కోహ్లీస్థానంలో వచ్చిన దీపక్‌హుడా అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో రోహిత్‌కు జతగా కోహ్లీని ఓపెనర్‌గా దించి మూడోస్థానంలో దీపక్‌ హుడాను కొనసాగించాలని టీమ్‌ భావిస్తోంది.

కోహ్లీతోపాటు తొలి మ్యాచ్‌లో లేని పంత్‌, బుమ్రా, జడేజా, శ్రేయస్ అయ్యర్‌ జట్టులోకి వచ్చారు. అక్షర్‌ స్థానంలో జడేజా జట్టులోకి రానుండగా.. భువనేశ్వర్‌కు బుమ్రా తోడు కానున్నాడు. ఇక తొలిమ్యాచ్‌లో అదరగొట్టిన అర్ష్‌దీప్‌సింగ్‌ను మిగితా మ్యాచ్‌లకు ఎంపిక చేయకపోవడంతో.. ఉమ్రన్‌ మాలిక్‌ జట్టులోకి రానున్నాడు. అటు.. సిరీస్‌ చేజారకుండా ఈ మ్యాచ్‌లో గెలవాలని ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కోరుకుంటోంది. తొలి మ్యాచ్‌లో డకౌటైన కెప్టెన్ బట్లర్ సహా హిట్టర్లు జేసన్‌ రాయ్‌, లివింగ్‌స్టోన్‌... రాణించాలని ఆ జట్టు ఆశిస్తోంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా శనివారం రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి: Malaysia Masters: క్వార్టర్​ ఫైనల్స్​లో సింధుకు షాక్​.. మళ్లీ ఆమె పైనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.