Tata Steel Chess Challengers: టాటా స్టీల్ చెస్ ఛాలెంజర్స్ విభాగంలో తెలుగుతేజం అర్జున్ ఇరిగైసి టైటిల్ సొంతం చేసుకున్నాడు. మరో రౌండ్ మిగిలి ఉండగానే అతడు విజేతగా నిలిచాడు. పన్నెండో రౌండ్లో థాయ్‌వాన్ (చెక్ రిపబ్లిక్)తో గేమ్‌ను డ్రా చేసుకున్న అర్జున్ 9.5 పాయింట్లతో అగ్రస్థానం ఖాయం చేసుకున్నాడు. ఈ టోర్నీలో 7 గేమ్‌ల్లో గెలిచిన అతడు ఐదు గేమ్‌లు డ్రా చేసుకున్నాడు. టైటిల్ విజేతగా నిలిచిన అర్జున్ వచ్చే ఏడాది మాస్టర్స్ టోర్నీకి అర్హత పొందాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-100లోకి దూసుకెళ్లాడు.
మరోవైపు మాస్టర్స్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతి.. ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను నిలువరించాడు. పదకొండో రౌండ్‌ను డ్రాగా ముగించాడు. ఈ మ్యాచ్ డ్రా అయినా కార్ల్‌సన్ (7.5 పాయింట్లు) అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. విదిత్ (6) ఆరో స్థానంలో ఉన్నాడు.
ఇదీ చదవండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!