ETV Bharat / sports

'ఒలింపిక్స్​లో స్వర్ణానికి ఇదే సువర్ణావకాశం' - టోక్యో ఒలింపిక్స్​ రాణి రాంపాల్​

టోక్యో ఒలింపిక్స్​లో బంగారు పతకమే గెలవడమే లక్ష్యంగా శ్రమిస్తున్నట్లు భారత పురుషుల, మహిళల హాకీ జట్టు కెప్టెన్లు చెప్పారు. స్వర్ణ పతకం గెలవడానికి ఇదే మంచి అవకాశమని కెప్టెన్ మన్​ప్రీత్ అన్నాడు​.

manpreet
మన్​ప్రీత్​ రాణిరాంపాల్​
author img

By

Published : May 10, 2021, 5:31 AM IST

Updated : May 10, 2021, 8:12 AM IST

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణ పతకం గెలిచే అవకాశాలు తమకున్నాయని భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్​ప్రీత్​ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు​. అందుకు తగ్గట్లే తమ జట్టు ప్రణాళిక ప్రకారం ఎక్కువ సేపు శిక్షణ కూడా చేస్తున్నట్లు తెలిపాడు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న మహిళల హాకీ జట్టు కూడా ఈ మెగా క్రీడల్లో విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పింది సారథి రాణి రాంపాల్​. ఒలింపిక్స్​ ప్రారంభమయ్యే వరకు ఇకపై ప్రతిరోజు తమకు ఎంతో కీలకమని వెల్లడించింది.

మరోవైపు స్పెయిన్​, జర్మనీతో జరగాల్సిన ఎప్​ఐఎఫ్​ ప్రో లీగ్, ప్రయాణ ఆంక్షల​ కారణంగా వాయిదా పడటం తమకు ఎదురుదెబ్బ తగిలినట్టయిందని ఇరుజట్ల కెప్టెన్లు అన్నారు. ఒకవేళ ఆ మ్యాచ్​లు జరుగుంటే ఒలింపిక్స్​ కోసం మరింత సన్నద్ధమయ్యేందుకు ఉపయోగపడేవని చెప్పారు.

కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్​.. ఈ సంవత్సరం జులై 23న ప్రారంభం కానుంది. అయితే కొవిడ్ ప్రభావంతో ఈ మెగాక్రీడల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు వరుసగా ఎనిమిది సార్లు స్వర్ణ పతకాన్ని సాధించగా.. చివరిసారిగా 1980లో సొంతం చేసుకుంది.

ఇదీ చూడండి: కరోనాను జయించిన మహిళల హాకీ జట్టు

Last Updated : May 10, 2021, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.