ETV Bharat / sports

రికార్డ్​ టైటిల్స్​తో మొదలై.. వివాదాలతో ముగిసి.. 2022 ఎంతో స్పెషల్​

కొన్ని విజయాలు.. క్రీడా లోకాన్ని సంతోషంలో ముంచాయి. కొన్ని ఓటములు.. అభిమానులకు బాధ కలిగించాయి. కొన్ని నిష్క్రమణలు.. కన్నీళ్లు పెట్టించాయి.ఇలా.. ఎన్నో భావోద్వేగాల మిళితమై.. మరెన్నో భావాలకు రూపమై.. అంతర్జాతీయ క్రీడా రంగంలో 2022 ప్రత్యేకంగా నిలిచిపోయింది. కరోనా తగ్గడంతో ప్రపంచ టోర్నీలతో సందడి.. సూపర్‌ స్టార్ల మెరుపులతో సంబరం నెలకొంది. సంచలన ప్రదర్శనలు..చరిత్రలో నిలిచిపోయే విజయాలకు ఈ ఏడాది వేదికగా మారింది. మరి.. అంతర్జాతీయ క్రీడా రంగంలోని కొన్ని ప్రధాన ఘట్టాలను ఓ సారి నెమరు వేసుకుందాం.. పదండి!

Sports 2022 Round up
ఆటతో మెప్పించి.. మనసులు కదిలించి.. 2022 ఎంతో స్పెషల్​
author img

By

Published : Dec 30, 2022, 7:03 AM IST

జనవరి 30 శిఖరానికి నాదల్‌

.

ప్రపంచంలో అత్యుత్తమ టెన్నిస్‌ ఆటగాడు అంటే.. ఎక్కువ శాతం వినిపించే పేరు రోజర్‌ ఫెదరర్‌. నైపుణ్యం, పోరాటంలో స్పెయిన్‌ యోధుడు రఫెల్‌ నాదల్‌ అతడికి ఏమాత్రం తీసిపోడు. రోజర్‌ కంటే ఆలస్యంగా ఆట ఆరంభించినా గ్రాండ్‌స్లామ్‌ వేటలో వేగంగా దూసుకెళ్లిన నాదల్‌ ఈ ఏడాది ఫెదరర్‌ను దాటి అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాదికి ముందు 20 టైటిళ్లతో ఫెదరర్‌, జకోవిచ్‌లతో సమానంగా ఉన్న నాదల్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (జనవరి 30)లో విజయంతో ఓపెన్‌ శకంలో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. అతను ఫైనల్లో కాస్పర్‌ రూడ్‌పై గెలిచాడు. జూన్‌లో తనకు అచ్చొచ్చిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజయంతో ఆ టైటిళ్ల సంఖ్యను 22కు పెంచుకుని శిఖరానికి చేరాడు.

మార్చి 4 కన్నీళ్లు మిగిల్చి..

.

అంతర్జాతీయ క్రీడా రంగంలో అద్భుత విజయాలతో ఆనందాన్ని అందించిన 2022.. అంతులేని విషాదాన్ని కూడా మిగిల్చింది. బంతిని గింగిరాలు తిప్పి.. మైదానంలో మాయ చేసిన స్పిన్‌ మాంత్రికుడు, ఆస్ట్రేలియా దిగ్గజం షేన్‌వార్న్‌ మరణం క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. విహార యాత్ర కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లిన అతను.. అక్కడే మార్చిలో ఓ విల్లాలో కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. 52 ఏళ్ల అతను గుండెపోటుతో మరణించాడు. అదే రోజు మరో ఆసీస్‌ మాజీ ఆటగాడు రాడ్‌ మార్ష్‌ (74) కన్నుమూశాడు. మే 14న ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ తుదిశ్వాస విడిచాడు. 46 ఏళ్ల అతను కారు ప్రమాదంలో మరణించడం దిగ్భ్రాంతి కలిగించింది. ఆల్‌టైమ్‌ దిగ్గజ బాస్కెట్‌బాల్‌ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగిన 88 ఏళ్ల బిల్‌ రసెల్‌ (అమెరికా) జులై 31న తనువు చాలించాడు.

ఏప్రిల్‌ 3 ఆస్ట్రేలియా ఆధిపత్యం..

.

ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఆ దేశ పురుషుల జట్టు ఇప్పటికే రికార్డు స్థాయిలో అయిదు సార్లు వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. మహిళల జట్టు విషయానికి వస్తే.. పురుషుల రికార్డును దాటి ప్రపంచకప్‌ల వేటలో దూసుకెళ్తోంది. ఈ ఏడాది వన్డేల్లో ఏడో ప్రపంచకప్‌ను ఆసీస్‌ అమ్మాయిలు ఖాతాలో వేసుకున్నారు. న్యూజిలాండ్‌లో జరిగిన ఫైనల్లో ఆ జట్టు 71 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఇప్పటివరకూ 12 మహిళల వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌లు జరిగితే.. అందులో ఏడు సార్లు (1978, 1982, 1988, 1997, 2005, 2013, 2017) ఆసీస్‌ విజేతగా నిలవడం విశేషం. మరోవైపు తొలిసారి కామన్వెల్త్‌ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల టీ20 టోర్నీలోనూ కంగారూ జట్టే ఛాంపియన్‌గా నిలిచింది. జులై 29న జరిగిన ఫైనల్లో ఆసీస్‌ 3 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది.

సెప్టెంబర్‌ 24 రాకెట్‌ను వదిలేసి..

.

ఓ ఫొటో టెన్నిస్‌ అభిమానులనే కాదు క్రీడా ప్రపంచాన్నే కదిలించింది. మైదానంలో శత్రువుల్లా తలపడే ఆ ఇద్దరిలో ఒకరు ఆటకు వీడ్కోలు పలుకుతుంటే మరొకరు వెక్కివెక్కి ఏడవడమే అందుకు కారణం. అందుకు ఫెదరర్‌ చివరి మ్యాచ్‌ వేదికగా నిలిచింది. చివరగా లేవర్‌ కప్‌లో నాదల్‌తో కలిసి డబుల్స్‌ ఆడిన ఫెదరర్‌ రాకెట్‌ వదిలేశాడు. ఆ భావోద్వేగ క్షణాల్లో ఫెదరర్‌తో కలిసి నాదల్‌ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానుల హృదయాల్ని పిండేసింది. రెండు దశాబ్దాలకు పైగా సొగసైన ఆటతో అలరించిన ఈ స్విస్‌ యోధుడు 41 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పాడు. 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో కెరీర్‌ ముగించాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న సెరెనా విలియమ్స్‌ కూడా ఈ ఏడాదే చివరి మ్యాచ్‌ ఆడేసింది! రిటైర్మెంట్‌ అనే పదాన్ని వాడనప్పటికీ.. యుఎస్‌ ఓపెన్‌తో కెరీర్‌ ముగించాననే అర్థం వచ్చేలా భావోద్వేగంతో మాట్లాడింది. కన్నీళ్లతో కోర్టును వీడింది. ఇక ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకులో ఉండి కూడా 25 ఏళ్ల వయసులోనే ఆష్లీ బార్టీ అనూహ్యంగా టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది.

అక్టోబర్‌ 9 దూకుడు కొనసాగిస్తూ..

.

ఫార్ములా వన్‌ అనగానే ముందుగా దిగ్గజం మైఖెల్‌ షుమాకర్‌ పేరే గుర్తుకొస్తుంది. ఈ జర్మనీ రేసర్‌ ట్రాక్‌పై సంచలనాలతో చరిత్ర సృష్టించాడు. అతని తర్వాత బ్రిటన్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ట్రాక్‌పై మెరుపులా సాగుతున్నాడు. అత్యధిక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిళ్లలో షుమాకర్‌, లూయిస్‌ చెరో ఏడు విజయాలతో సమానంగా ఉన్నారు. 37 ఏళ్ల హామిల్టన్‌ వేగం నెమ్మదించినట్లే కనిపిస్తోంది. దీంతో భవిష్యత్‌ ఎఫ్‌1 స్టార్‌ ఎవరు? అనే ప్రశ్నకు బదులుగా 25 ఏళ్ల మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (బెల్జియం) దూసుకొచ్చాడు. ఈ రెడ్‌ బుల్‌ రేసర్‌ వరుసగా రెండో ఏడాదీ ఎఫ్‌1 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. 2022లో మరో నాలుగు రేసులు ఉండగానే అతను టైటిల్‌ ఖాయం చేసుకోవడం విశేషం. అక్టోబర్‌లో జపనీస్‌ గ్రాండ్‌ ప్రి రేసులో విజయంతో అతను ఛాంపియన్‌గా నిలవడం ఖాయమైంది. ఈ ఏడాది 22 రేసులకు గాను అతను.. 15 రేసులను గెలిచాడు. మొత్తం 454 పాయింట్లతో నంబర్‌వన్‌గా నిలిచాడు. రెండో స్థానాన్ని దక్కించుకున్న లెక్లెర్క్‌ (308)కు, అతనికి మధ్య పాయింట్ల అంతరాన్ని గమనిస్తే ట్రాక్‌పై వెర్‌స్టాపెన్‌ ఆధిపత్యం అర్థమవుతోంది.

నవంబర్‌ 13 ఇంగ్లాండ్‌.. ధనాధన్‌..

.

క్రికెట్‌ పుట్టినిళ్లు కానీ.. ప్రపంచకప్‌ల్లో మాత్రం తడబాటే.. ఇదీ గతంలో ఇంగ్లాండ్‌పై వినిపించిన విమర్శ. కానీ ఇప్పుడా జట్టు ఖాతాలో ఒక వన్డే, రెండు టీ20 ప్రపంచకప్‌లున్నాయి. 2010లో తొలిసారి పొట్టికప్పును ముద్దాడి.. ప్రపంచకప్‌ బోణీ కొట్టిన ఆ జట్టు.. ఈ ఏడాది టీ20ల్లో మరోసారి విశ్వ విజేతగా నిలిచింది. జట్టు నిండా స్టార్‌ ఆటగాళ్లతో.. అధిక సంఖ్యలో ఆల్‌రౌండర్లతో ఆ జట్టు విజయాల వేటలో దూసుకెళ్తోంది. 2022లో ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్‌లో అంచనాలను నిలబెట్టుకుంటూ ఆ జట్టు కప్పు కొట్టేసింది. తుదిపోరులో పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న ఇంగ్లిష్‌ జట్టు.. టెస్టుల్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్లోనూ ‘బజ్‌బాల్‌’ ఆటతీరుతో సంచలన విజయాలు సాధించింది. సంప్రదాయ ఫార్మాట్‌కు దూకుడు అద్ది ఆటను మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది.

డిసెంబర్‌ 18 కల నిజమాయె..

.

పీలే, మారడోనా లాంటి ఫుట్‌బాల్‌ దిగ్గజాల కెరీర్‌లు పరిపూర్ణమయ్యాయంటే అందుకు కారణం ప్రపంచకప్‌ను ముద్దాడడమే. ఈ తరంలో అద్భుతమైన నైపుణ్యాలతో అలరిస్తున్న లియొనెల్‌ మెస్సీకి అది కలగా ఉండేది. కానీ ఈ ఏడాది ఖతార్‌ వేదికగా ఆ ముచ్చటా తీరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆశించినట్లుగా ఈ మేటి ఆటగాడు కప్పును అందుకున్నాడు. బహుశా కెరీర్‌లో చివరిదైన ప్రపంచకప్‌లో కల సాకారం చేసుకున్నాడు. అయిదో ప్రయత్నంలో విజయవంతమై.. 36 ఏళ్ల అర్జెంటీనా సుదీర్ఘ నిరీక్షణకూ తెరదించాడు. ఫిఫా ప్రపంచకప్‌ చరిత్రలోనే ఉత్తమ ఫైనల్‌గా నిలిచిపోయే పోరులో ఫ్రాన్స్‌పై మెస్సి జట్టు గెలిచింది. ఎంతో హోరాహోరీగా సాగి.. అభిమానులకు అసలు సిసలైన కిక్‌ అందించిన ఆ సాకర్‌ సమరంలో పెనాల్టీ షూటౌట్లో ఫలితం తేలింది. మొదట మ్యాచ్‌లో రెండు గోల్స్‌, చివర్లో షూటౌట్లో ఓ గోల్‌తో విజయంలో మెస్సి కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో ఓడినా మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో అలరించిన ఎంబాపె సరికొత్త సూపర్‌ స్టార్‌గా మారాడు. బహుశా ఆఖరి ప్రపంచకప్‌ ఆడేసిన రొనాల్డో, నెయ్‌మార్‌కు కప్పు లోటు అలాగే మిగిలిపోనుంది.

ఈ వివాదాలు.. కరోనా టీకా వేసుకోకుండానే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ కోసం జనవరిలో ఆ దేశానికి వెళ్లిన నొవాక్‌ జకోవిచ్‌ను తిరిగి వెనక్కి పంపించడంతో ఈ ఏడాది ఆటల్లో వివాదాలకు తెరలేచింది. ఆస్ట్రేలియా సరిహద్దు భద్రత దళం అతణ్ని అదుపులోకి తీసుకొని ఓ హోటల్లో ఉంచింది. అతని వీసాను రద్దు చేసి దేశం నుంచి పంపించింది. కానీ వచ్చే నెల ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు అతణ్ని అనుమతించడం గమనార్హం. మరోవైపు ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలెట్టిన రష్యాపై వివిధ ప్రపంచ క్రీడా సమాఖ్యలు నిషేధం బాంబు వేశాయి. రష్యాకు సాయం చేస్తున్నందుకు బెలారస్‌ ప్లేయర్లనూ వివిధ టోర్నీల్లో పాల్గొనకుండా నిషేధించారు. సెప్టెంబర్‌లో సింక్‌ఫీల్డ్‌ కప్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ నీమన్‌తో పోరులో తొలి ఎత్తు వేసిన తర్వాత ప్రపంచ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌ గేమ్‌ నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. ఇప్పటికే చాలా గేమ్‌ల్లో నీమన్‌ మోసం చేశాడని కార్ల్‌సన్‌ ఆరోపించాడు.

ఇదీ చూడండి: ఫుట్​బాల్​ దిగ్గజం పీలే కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.