ETV Bharat / sports

సాక్షి మాలిక్​కు మరోసారి నిరాశ

భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఒలింపిక్స్ ఆశలపై నీళ్లు చల్లింది సోనమ్ మాలిక్. ఈ మెగాటోర్నీ కోసం జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీలో సాక్షిపై సోనమ్ 8-7తోడాతో విజయం సాధించింది.

Sakshi Malik
సాక్షి మాలిక్​
author img

By

Published : Mar 23, 2021, 9:14 AM IST

భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ టోక్యో ఒలింపిక్స్‌ ఆశలపై మరోసారి సోనమ్‌ మాలిక్‌ నీళ్లు చల్లింది. 2016 రియో ఒలింపిక్స్‌ కాంస్య విజేత సాక్షి.. ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీ అయిన ఆసియా క్వాలిఫయింగ్‌ రెజ్లింగ్‌ టోర్నీలో పాల్గొనే భారత బృందంలో చోటు దక్కించుకోలేకపోయింది.

ఒలింపిక్స్​తో పాటు కజకిస్థాన్‌లో జరిగే ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం సోమవారం నిర్వహించిన సెలక్షన్‌ ట్రయల్స్‌లో మహిళల 62 కేజీల విభాగంలో 18 ఏళ్ల సోనమ్‌ 8-7 తేడాతో సాక్షిపై గెలిచింది. వరుసగా నాలుగు ట్రయల్స్‌లోనూ సాక్షిపై సోనమ్‌దే పైచేయి కావడం విశేషం. ఈ ఏడాది జాతీయ ఛాంపియన్‌షిప్‌లోనూ సాక్షిని ఓడించిన సోనమ్‌ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 9న ఆరంభమయ్యే ఈ పోటీల కోసం సీమ (50 కేజీలు), అన్షు మాలిక్‌ (57 కేజీలు), నిశ (68 కేజీలు), పూజ (76 కేజీలు) కూడా అర్హత సాధించారు. మిగిలిన నాలుగు విభాగాల్లో సెలక్షన్‌ ట్రయల్స్‌ను శనివారం నిర్వహించనున్నట్లు భారత రెజ్లింగ్‌ సమాఖ్య సహాయక కార్యదర్శి వినోద్‌ తోమర్‌ వెల్లడించాడు.

ఇప్పటికే నిర్వహించిన ట్రయల్స్‌లో సందీప్‌ సింగ్‌ (74 కేజీలు), సత్యవర్థ్‌ కడియాన్‌ (97 కేజీలు), సుమిత్‌ మాలిక్‌ (125 కేజీలు), గ్రీకో రోమన్‌ విభాగంలో.. జ్ఞానేందర్‌ (60 కేజీలు), అషు (67 కేజీలు), గుర్‌ప్రీత్‌ సింగ్‌ (77 కేజీలు), సునీల్‌ కుమార్‌ (87 కేజీలు), రవి (97 కేజీలు), నవీన్‌ (130 కేజీలు) సత్తాచాటి ఆ టోర్నీకి అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.