ETV Bharat / sports

మళ్లీ ప్రత్యర్థిదే పైచేయి.. మలేసియా ఓపెన్​ నుంచి సింధు ఔట్ - పీవీ సింధు

మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్​ నుంచి వైదొలిగింది రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు. కౌలాలంపూర్ వేదికగా శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్​ క్వార్టర్స్​లో చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్​ చేతిలో సింధు ఓటమిపాలైంది.

Malaysia Open
pv sindhu malaysia open
author img

By

Published : Jul 1, 2022, 5:25 PM IST

మలేసియా ఓపెన్ సూపర్​ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్​ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్​ క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్​ చేతిలో ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్​లో 13-21, 21-15, 21-13 తేడాతో రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సింధు ఓటమిపాలైంది. దీంతో సింధుపై తన ఆధిపత్యాన్ని అలాగే కొనసాగించింది తై జు.
మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్స్​లో ప్రపంచ నెం.8 జొనాథన్ క్రిస్టీతో తలపడనున్నాడు భారత థామస్ కప్ స్టార్ హెచ్​ఎస్ ప్రణయ్.

ఇదీ చూడండి: నాపై ఆ ఒత్తిడి లేదు.. దాని గురించి ఆలోచిస్తే అంతే: నీరజ్ చోప్రా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.