యూఏఈలో జరుగుతున్న షూటింగ్ పారా ప్రపంచకప్లో భారత షూటర్ మనీశ్ నర్వాల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీనితో పాటే 50 మీటర్ల పిస్టోల్ మిక్స్డ్ విభాగంలో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. టోర్నీలో మనకు ఇది రెండో బంగారు పతకం. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఎస్హెచ్1 విభాగంలో సింగ్రాజ్ ఈ మెడల్ సాధించాడు.
2019లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించిన నర్వాల్.. 229.1 పాయింట్లు తెచ్చుకుని స్వర్ణం అందుకున్నాడు. రెండో స్థానంలో నిలిచిన జవన్మర్ది(223.4).. మనీశ్ కంటే 5.7 పాయింట్ల తక్కువ సాధించాడు.
మరోవైపు దిల్లీలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్లో మన దేశానికి చెందిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్.. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ విభాగంలో బంగారు పతకం తెచ్చుకున్నాడు.
ఇవీ చదవండి: