ప్రెసిడెంట్స్కప్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ బాక్సర్‌గా పేరు లిఖించుకున్నాడు నాలుగుసార్లు ఆసియా ఛాంపియన్ శివ థాప. శనివారం కజకిస్థాన్‌లోని ఆస్తానా వేదికగా ఈ టోర్నీ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జాకిర్ సఫుల్లిన్ గాయం కారణంగా వైదలగడం వల్ల విజేతగా నిలిచాడు శివ.
63 కేజీల విభాగంలో ప్రెసిడెంట్స్ కప్‌లో పాల్గొన్నాడు. శనివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌లో కజకిస్థాన్ ఆటగాడు జాకిర్ సఫుల్లిన్తో రింగ్‌లో దిగాల్సింది. గాయం కారణంగా ప్రత్యర్థి టోర్నీ నుంచి వైదొలగడం వల్ల శివను విజేతగా ప్రకటించారు. ఇదే ఏడాది జరిగిన ఆసియా ఛాంపియన్షిప్ సెమీఫైనల్లో జాకిర్ చేతిలో ఓటమి పాలయ్యాడు శివథాప. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న భారత స్టార్ బాక్సర్‌కు నిరాశే ఎదురైంది.
" కొత్త కేటగిరీలో బరిలోకి దిగాను. ఈ టోర్నీలో కష్టమైన బౌట్లు ఏమి ఎదుర్కోలేదు. 64 కేజీల విభాగం నుంచి వచ్చిన బాక్సర్లతో పోటీపడటం కష్టమే కాని అసాధ్యమైతే కాదని తెలుసుకున్నా".
-- శివథాప, భారత బాక్సర్
గతంలో శివ 60 కేజీల విభాగంలో ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. అయితే ఈ కేటగిరీని తొలగించడం వల్ల 63 కేజీల విభాగంలో మ్యాచ్‌లకు సన్నద్ధమవుతున్నాడు.
ఇదే టోర్నీలో కొందరు భారత బాక్సర్లు ఫర్వాలేదనిపించారు. ప్రవీణ్(60 కేజీలు) ఫైనల్లో ఓటమి పాలై వెండి పతకం సాధించాడు.
సెమీఫైనల్లో ఓటమిపాలైన బూర స్వీటీ(81 కేజీలు), దుర్యోధన్ సింగ్ నేగి(69 కేజీ) కాంస్య పతకాలతోనే సరిపెట్టుకున్నారు.
-
. #PresidentCup Update!
— Boxing Federation (@BFI_official) July 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
India's @boorasweety04 and #Parveen won their respective bouts at the ongoing 7th President's Cup in Kazakhstan to reach the semi-finals.
Best of luck, girls. 👍💪#PunchMeinHaiDum #boxing pic.twitter.com/EZsoY73BuU
">. #PresidentCup Update!
— Boxing Federation (@BFI_official) July 18, 2019
India's @boorasweety04 and #Parveen won their respective bouts at the ongoing 7th President's Cup in Kazakhstan to reach the semi-finals.
Best of luck, girls. 👍💪#PunchMeinHaiDum #boxing pic.twitter.com/EZsoY73BuU. #PresidentCup Update!