ETV Bharat / sports

Sheetal Devi Archery : చేతులు లేకున్నా సడలని విశ్వాసం.. రెండు స్వర్ణాలు, ఓ రజతంతో ఎందరికో స్ఫూర్తిగా.. ​ - ఆర్చర్​ శీతల్​ దేవి బయోగ్రఫీ

Sheetal Devi Archery : చిన్నప్పటి నుంచే కష్టాలు తనను వెంటాడుతున్నాయి. ఓ రుగత్మ కారణంగా తన రెండు చేతులు పోయినా ఆమె అధైర్యపడలేదు. ఓ వైపు పేదరికం వెంటాడుతున్నా.. పట్టుదలతో విల్లును ఎక్కుపెట్టి పసిడి పతకాలు సాధించింది. చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన తొలి పారా ఆర్చర్​గా చరిత్రకెక్కింది. ఆమె పారా గేమ్స్​ స్వర్ణ పతాక విజేత శీతల్​ దేవి. ఈ 16 ఏళ్ల సూపర్​ ఆర్చర్​ విజయ గాథ గురించి తెలుసుకుందాం..

Sheetal Devi Archery
Sheetal Devi Archery
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 2:25 PM IST

Sheetal Devi Archery : విల్లు ఎక్కు పెట్టి లక్ష్యాన్ని ఛేదించాలంటే దానికి ఎంతో కృష్టి ఉండాలి. చక్కని దృష్టితో పాటు ఏకాగ్రత.. తీక్షణత ఉండాలి. రెండు చేతులు సరిగా ఉన్నవాళ్లే కొన్ని సార్లు ఈ పనిని చేయలేక విఫలవుతుంటారు. కానీ చేతులు లేకుండా బాణాలను సంధింస్తూ చరిత్ర సృష్టిస్తోంది జమ్ముకు చెందిన ఆర్చర్​ శీతల్‌ దేవి. చైనా హంగ్జౌ వేదికగా జరిగిన పారా ఆసియా క్రీడల్లో ఈ 16 ఏళ్ల ఆర్చర్​ కాళ్లతోనే లక్ష్యాన్ని ఛేదించి పసిడిని ముద్దాడింది. అయితే ఈ విజయ పథంలో నడిచేందుకు ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.

  • 2 year's before whn I visited to #SheetalDevi village in Loi Dhaar (Kishtwar), she totally surprised me by her actions.
    She was adopted by Indian Army 11 RR Col. Shishpal & thy mde efforts & tried to tie up with no. of NGO's.
    It ws difficult task bt nvr fr Army @NorthernComd_IA pic.twitter.com/b69zvkDaEl

    — Deepak Prem Thakur 🇮🇳 (@DeepakThakur_10) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని లోయి ధార్ అనే మారుమూల గ్రామానికి చెందిన శీతల్ దేవి.. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి పొలం పనులు చేస్తే.. తల్లి మేకలు కాసేది. ఈ ఇద్దరూ పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితి వారిది. పుట్టినప్పటి నుంచి ఫోకోమెలియా అనే వ్యాధితో బాధపడుతున్న శీతల్​.. దాని కారణంగా తన రెండు చేతులూ పోగొట్టుకుంది. అయినప్పటికీ ఆమె నిరాశ చెందలేదు. ఎలాగైన ఆ ఇంటికి ఆసరాగా నిలవాలనుకుంది. పెద్దయ్యాక టీచర్ అవ్వాలని కలలు కనింది. కానీ భారత సైన్యం నిర్వహించిన ఓ స్పోర్ట్స్​ ఈవెంట్‌ ఆమె లక్ష్యాన్నే మార్చేసింది.

ఆ పోటీలు.. తన జీవితంలో ఓ టర్నింగ్​ పాయింట్​..
Sheetal Devi Biography : 2021లో కిష్త్వార్‌లో భారత సైన్యం ఓ క్రీడా పోటీలను నిర్వహించింది. అందులో ఆమె చురుకుదనాన్ని చూసిన ఇండియన్​ ఆర్మీ ఆమెను క్రీడల వైపు ప్రోత్సహించింది. అంతే కాకుండా ఆమెకు కృత్రిమ చేతులను అమర్చేందుకు ప్రయత్నించింది. దానీ కోసం బెంగళూరులోని మేజర్ అక్షయ్ గిరీశ్​ మెమోరియల్ ట్రస్ట్‌ను సంప్రదించింది. అయితే కృత్రిమ చేతులు ఆమెకు సరిపోలేదు. అయనప్పటికీ తన లక్ష్యాన్ని ఎలగైనా సాధించాలని పట్టుదలతో ట్రైనింగ్​కు హాజరైంది. అలా కత్రాలోని శ్రీ మాతా వైష్ణో దేవి ష్రైన్ బోర్డ్ అకాడమీలో శిక్షణ తీసుకునేందుకు వెళ్లింది.

  • Impossible is Nothing. Still can't stop watching this continuously on loop and just be in awe of the inspiration that is #SheetalDevi, 16 yr old daughter of Shakti ji & Mann Singh Ji from a small village in Kishtwar, J&K.
    Worlds first armless female archer to win a Gold. Truly… pic.twitter.com/Yyu2Em0WKS

    — VVS Laxman (@VVSLaxman281) October 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అక్కడున్న ఇతర పారా ఆర్చర్లు ఎలా ఆర్చరీ చేస్తున్నారో గమనించింది. వారిని చూసి ప్రేరణ చెందిన శీతల్​..తనకంటూ ఓ ప్రత్యేక శైలిని రూపొందించుకుంది. ఒక కుర్చీలో కూర్చొని కుడి కాలితో బాణాన్ని పట్టుకుని ఆ తర్వాత కుడి భుజం ఆధారంగా చేసుకుని నోటితో విల్లు నారిని లాగి గురి చూసి కొట్టేది. అలా క్రమ క్రమంగా విలువిద్యలో తనను తాను మెరుగుపరుచుకుని దూసుకెళ్లింది. రెండు చేతులు ఉన్న ఆర్చర్లతో పోటీపడి గెలిచేది.

పారా గేమ్స్​లో అరుదైన ఘనత..
Sheetal Devi Asian Para Games : జులైలో చెక్‌ రిపబ్లిక్‌లో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని సాధించిన శీతల్​.. రెండు చేతులు లేకుండా ఈ ఘనత సాధించిన తొలి ఆర్చర్‌గా చరిత్రకెక్కింది. సింగపూర్ ఆర్చర్ అలీమ్ నూర్ ఎస్‌ను 144.142 తేడాతో ఓడించి ఈ పతకాన్ని ఆమె సాధించింది. తాజాగా జరిగిన ఆసియా పారా గేమ్స్​లో రాకేష్ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్ కాంపౌండ్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. అంతే కాకుండా టీమ్ ఈవెంట్‌లో రజతం, మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇలా పారా గేమ్స్‌లోని ఒకే ఎడిషన్‌లో రెండు బంగారు పతకాలు సాధించిన మొదటి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

  • It is a Glorious Gold for our Para Archery Mixed Team.

    Congrats to Sheetal Devi and @RakeshK21328176 for their extraordinary performance.

    This glory is a testament to their precision, dedication and exceptional skills. pic.twitter.com/g5Pw5qdJl7

    — Narendra Modi (@narendramodi) October 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆనంద్‌ మహీంద్రా ఆఫర్​..
ఆమె అద్భుతమైన ప్రదర్శనకు ఫిదా అయినా ఎంతో మంది ప్రముఖులు.. సోషల్ మీడియా వేదికగా శీతల్​ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. శీతల్​కు తన కంపెనీ కారును బహుకరిస్తున్నట్లు ప్రకటించారు. తమ కంపెనీ అందిస్తున్న కార్లలో దేన్నైనా ఆమె ఎంచుకోచ్చవని ఆఫర్‌ ఇచ్చారు. దాన్ని ఆమె ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది అందజేస్తామని హామీ ఇచ్చారు.

  • I will never,EVER again complain about petty problems in my life. #SheetalDevi you are a teacher to us all. Please pick any car from our range & we will award it to you & customise it for your use. pic.twitter.com/JU6DOR5iqs

    — anand mahindra (@anandmahindra) October 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రస్తుతం ఒలింపిక్‌ గోల్డ్‌క్విస్ట్‌ మద్దతుతో ఇబ్బంది లేకుండా శీతల్​ ఆర్చరీ విద్యలో కొనసాగుతోంది. టోర్నీ టోర్నీకి మెరుగవుతోంది. 10 మీటర్ల ఇన్నర్‌ సర్కిల్‌లో బాణాలను స్థిరంగా వేస్తోంది. వచ్చే ఏడాది పారిస్‌ పారాలింపిక్స్‌లో పాల్గొని పతకం గెలవాలనేది శీతల్‌ లక్ష్యం.

  • A big round of applause to Sheetal Devi for seizing the gold🥇with her phenomenal talent in the Para Archery Women's Individual Compound Open event at the #AsianParaGames. You have proven the true spirit of our nation. The nation rejoices in your success. pic.twitter.com/QExcwoxDlx

    — Amit Shah (@AmitShah) October 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Asian Para Games 2023 : పారా క్రీడల్లో భారత్‌ నయా రికార్డు.. 100 పతకాల దిశగా జర్నీ!

Para Asian Games 2023 : పారా ఆసియా క్రీడల్లో తెలుగు తేజాలు అదరహో.. భారత్ ఖాతాలో పసిడి జాతర!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.