స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్).. అథ్లెట్లకు మొట్టమొదటిసారి (SAI Institutional Awards) ఇన్స్టిట్యూషనల్ అవార్డులను ప్రదానం చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మెరుగైన ప్రదర్శన చేసిన 162 మంది ఆటగాళ్లకు, 84 మంది కోచ్‌లను సత్కరించింది. ఈ మేరకు రూ.85.02 లక్షల నగదును అందించింది. ఈ కార్యక్రమానికి భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు.
"అవార్డులు గెలుచుకున్న వారికి శుభాకాంక్షలు. ప్రతి ఒక్క అథ్లెట్ నేటితరానికి స్ఫూర్తిదాయకం. ఆటలు జాతీయ విద్యా విధానంలో భాగమే. మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను"
-అనురాగ్ ఠాకూర్, భారత క్రీడా శాఖ మంత్రి
2016 నుంచి గతేడాది వరకు ఆటల్లో మంచి ఫలితాలు కనబరిచిన అథ్లెట్లకు, కోచ్‌లకు అవార్డులు ప్రదానం చేశారు. అత్యత్తమ, ఉత్తమ పురస్కారాలు అనే రెండు జాబితాల్లో పురస్కారాలు ఇచ్చారు.
ఇదీ చదవండి:ICC rankings t20: కోహ్లీ మళ్లీ అదే స్థానంలో.. మెరుగైన వార్నర్