ETV Bharat / sports

PV Sindhu India Open: సెమీస్​లోకి దూసుకెళ్లిన పీవీ సింధు - ఇండియా ఓపెన్ 2022 కశ్యప్

PV Sindhu India Open: భారత స్టార్​ షట్లర్ పీవీ సింధు ఇండియా ఓపెన్​ 2022లో విజయ పరంపర కొనసాగిస్తోంది. శుక్రవారం టోర్నీలో సెమీఫైనల్స్​కు చేరుకుంది. మరోవైపు లక్ష్యసేన్​, కశ్యప్​ కూడా సెమీస్​లో అడుగుపెట్టారు.

PV Sindhu
పీవీ సింధు
author img

By

Published : Jan 14, 2022, 4:12 PM IST

Updated : Jan 14, 2022, 4:48 PM IST

PV Sindhu India Open: ఇండియా ఓపెన్ 2022లో భారత స్టార్ షట్లర్ పీపీ సింధు సెమీస్​కు చేరుకుంది. అశ్మిత ఛాలిహను 21-7, 21-18 తేడాతో ఓడించింది. అంతకుముందు సింధు.. ఇరా శర్మను 21-10, 21-10 తేడాతో ఓడించి క్వార్టర్స్​లోకి ప్రవేశించింది.

sindhu
పీవీ సింధు

మరోవైపు లక్ష్యసేన్, ఆకర్షి కశ్యప్ కూడా ఇండియా ఓపెన్​ టోర్నీలో సెమీస్​లోకి అడుగుపెట్టారు. షట్లర్​ హెచ్​ఎస్ ప్రణయ్​పై 14-21, 21-9, 21-14 తేడాతో గెలిచాడు లక్ష్యసేన్. మాల్వికా మన్సోద్​పై 21-12, 21-15 తేడాతో విజయం సాధించాడు కశ్యప్.

శుక్రవారం సాయంత్రం.. సాత్విక్- చిరాగ్ పురుషుల డబుల్స్ జోడీ మలేషియాకు చెందిన కియాన్​ హీన్- లో కియాన్ హీన్ జోడీతో తలపడనుంది.

కొవిడ్ ప్రభావం..

ప్రస్తుతం జరుగుతున్న​ టోర్నీలో భారత్​కు చెందిన ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్పతో పాటు మరో ఐదుగురికి కరోనా సోకినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్​ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్​) ఇటీవలే వెల్లడించింది.

ఇదీ చదవండి:

Badminton World Championships: కొడుతుందా మళ్లీ.. రెండో టైటిల్‌పై సింధు గురి

India Open 2022: సింధు క్వార్టర్స్​లోకి.. సైనా ఔట్

Last Updated : Jan 14, 2022, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.