ETV Bharat / sports

'రన్​ టు ది మూన్​' ద్వారా రూ.19 లక్షల సేకరణ - అథ్లెట్లు, కోచ్​ల సహాయం కోసం రన్​ టూ ద మూన్​

లాక్​డౌన్​ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోచ్​లు, అథ్లెట్లు, సహాయక సిబ్బందిని ఆదుకోవడం కోసం "రన్​ టు ది మూన్​" కార్యక్రమం నిర్వహించారు. దీని ద్వారా దాదాపు రూ.19 లక్షలను సేకరించారు.

Pullela Gopichand lauds Run to the Moon, which raises Rs 19 lakh for needy coaches, support staff
'రన్​ టు ది మూన్​' ద్వారా రూ.19 లక్షల సేకరణ
author img

By

Published : Jul 24, 2020, 8:56 AM IST

కరోనా లాక్​డౌన్​తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోచ్​లు, సహాయక సిబ్బందిని ఆదుకునేందుకు నిర్వహించిన "రన్​ టు ది మూన్​" పరుగు ద్వారా రూ.19 లక్షలు పోగయ్యాయి. భూమి నుంచి చంద్రుని మధ్య దూరాన్ని (3,84,400 కిలోమీటర్లు) నెల రోజుల వ్యవధిలో పూర్తి చేసేందుకు, తమ పేర్లను నమోదు చేసి డబ్బులు చెల్లించారు. ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల నుంచి సుమారు 14 వేల మంది రన్నర్లు ఈ వర్చువల్​ పరుగులో పాల్గొన్నారు.

అయితే ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. చంద్రుడిపై తొలిసారి మానవుడు అడుగుపెట్టిన రోజైన జులై 21న ముగిసిన ఈ పరుగులో మొత్తం 9,08,800 కిలోమీటర్లను రన్నర్లు పూర్తి చేయడం విశేషం. అథ్లెట్లు ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటూనే ఈ పరుగులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ బ్యాడ్మింటన్​ ప్రధాన కోచ్​ పుల్లెల గోపీచంద్​ మార్గనిర్దేశకుడిగా వ్యవహరించాడు. ఈ విరాళాలను బ్యాడ్మింటన్​, టెన్నిస్​, బాస్కెట్​బాల్​, ఫుట్​బాల్​, అథ్లెటిక్స్​ లాంటి క్రీడల కోచ్​లు, సహాయక సిబ్బందికి అందజేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.